తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి - ది బిగినింగ్’ త్వరలో చైనా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. భారతదేశం కన్నా ఎక్కువ థియేటర్లలో భారీ స్థాయిలో ‘బాహుబలి’ని విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తెలిపారు. దిల్లీలో ఓ వార్తా సంస్థతో రాజమౌళి మాట్లాడుతూ ‘‘చైనాలో 6500 తెరల్లో ‘బాహుబలి’సినిమాని విడుదల చేయబోతున్నాం ఇది తెలుగు సినిమాలోనే అరుదైన రికార్డ్ అని అన్నారు. ఇది భారతదేశం కన్నా చాలా ఎక్కువ. ఈ నెలలోనో లేదా వచ్చే నెలలోనో అక్కడ ‘బాహుబలి’ విడుదలవుతుందని'' చెప్పారు.
‘బాహుబలి-ది కంక్లూజన్’ గురించి చెబుతూ ‘ప్రస్తుతం బాహుబలి- ది కంక్లూజన్ చిత్రీకరణ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం. మొదటి భాగం విడుదలైన మూడు, నాలుగు నెలల్లో రెండో భాగాన్ని విడుదల చేయాలనుకున్నాం.
అయితే కొన్ని కారణాల వల్ల ఏడాదిన్నర ఆలస్యమవుతోంది. రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ విషయంలో నాకు ఒత్తిడి లేదు. నిజానికి వారి అంచనాలే ఒత్తిడిని దూరం చేస్తున్నాయి. ఇంత విరామం తర్వాత వస్తున్నా రెండో భాగం తప్పక ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకముందని’ అన్నారు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more