k raghavendrarao planing youtube channel for teaching lessons

K raghavendrarao planing youtube channel for teaching lessons

k raghavendrarao, director raghavendrarao, krr classes, krr classes youtube, krr teaching

k raghavendrarao planing youtube channel for teaching lessons : k raghavendrarao teaching some direction tips and his experiances to young stars who are interested in film indusrty. now he is planing krr youtube channel to do this work.

ఇది మన మాస్టారి రూమ్...!

Posted: 06/11/2016 04:24 PM IST
K raghavendrarao planing youtube channel for teaching lessons

వెండితెరకు రంగుల హరివిల్లును చూపించిన దర్శకుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. సాధారణమైన హీరోయిన్‌కి సైతం స్టార్‌ డమ్‌ తీసుకురాగలిగే సత్తా ఉన్న దర్శకుడు.
కమర్షియల్‌ సినిమాకు గ్లామర్‌ని అద్దిన దర్శకేంద్రుడు.. ఆయనే కె.రాఘవేంద్రరావు బి.ఎ. శతాధిక చిత్రాల దర్శకుడైన రాఘవేంద్రరావు ఇప్పుడు అధ్యాపకుడిగా కొత్త బాధ్యతను చేపట్టారు. ఫిల్మ్‌ స్కూల్‌ సిలబస్‌తో సంబంధం లేకుండా తన 50 ఏళ్ళ సినీ అనుభవాల్ని పాఠాలుగా మారుస్తున్నారు.

పాటలను చిత్రీకరించడంలో తానేంటో నిరూపించిన దర్శకేంద్రుడు నేడు పాఠాలు బోధించడంలో కూడా కొత్త పంథాను ఎన్నుకున్నారు. ఒక అనుభవశాలి అయిన దర్శకుడు ప్రాక్టికాలిటీ ఇన్‌ ఫిల్మ్‌ డైరెక్షన్‌ ప్రధానాంశంగా చేసుకొని పాఠాలు బోధించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావొచ్చు.

ఈ పాఠాలు విని దర్శకులు కాబోయేవారు, దర్శకత్వం పట్ల మక్కువ వున్నవారు ఏ క్లాస్‌ రూమ్‌కీ వెళ్ళక్కర్లేదు. ఫీజు కట్టక్కర్లేదు. యూ ట్యూబ్‌లోని కెఆర్‌ఆర్‌ క్లాస్‌ రూమ్‌కి వెళ్తే చాలు. ఆ ఛానల్‌ దర్శకత్వానికి దారి చూపిస్తుంది. ఫిల్మ్‌ మేకింగ్‌లో మెళకువలు నేర్పిస్తుంది. జూన్‌ 10వ తేదీన 4 గంటలకు కెఆర్ ఆర్ అనే యూట్యూబ్ ఛానల్‌లో మొదటి పాఠం దర్శనమిస్తుంది. తర్వాత 10 రోజులకో పాఠం ప్రేక్షకుల్ని పలకరిస్తుంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles