సెల్ఫీ రాజా కామెడీ టీజర్ | Selfie Raja Teaser

Selfie raja teaser

Selfie Raja Teaser, Selfie Raja Poster, Selfie Raja First Look, Selfie Raja movie updates, Selfie Raja latest updates, Allari Naresh movies, Allari Naresh latest stills, Allari Naresh updates, Allari Naresh tweets, Allari Naresh, Sakshi Chaudhary hot stills, Sakshi Chaudhary

Selfie Raja Teaser: Allari Naresh's upcoming Comedy entertainer Selfie Raja teaser is out. Sakshi Chaudhary & Kamna Ranawat paired with him for the movie.

సెల్ఫీ రాజా కామెడీ టీజర్

Posted: 06/10/2016 03:00 PM IST
Selfie raja teaser

మొన్నటివరకు వరుస సినిమాలతో సందడి చేసిన అల్లరి నరేష్ ఈమధ్య కాస్త స్లో అయ్యాడనిపిస్తోంది కదూ! కానీ మళ్లీ తనదైన శైలిలో సందడి చేయడానికి ఈసారి ‘సెల్ఫీ రాజా’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జి. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎకె.ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో గోపి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత చలసానీ రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

ఈరోజు అల్లరి నరేష్ తండ్రి, ప్రముఖ దర్శకులు ఇవివి సత్యనారాయణ జయంతి సంధర్భంగా ‘సెల్ఫీ రాజా’ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్లను విడుదల చేసారు. ఈ టీజర్లో ‘సెల్ఫీ రాజా’ తనదైన శైలిలో మరోసారి కామెడీతో అదరగొట్టనున్నట్లుగా తెలుస్తోంది. ‘జేమ్స్ బాండ్’ తర్వాత మరోసారి సాక్షి చౌదరితో అల్లరి నరేష్ జతకట్టాడు.

అలాగే మరో హీరోయిన్ గా కామ్న రనావత్ నటిస్తుంది. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అల్లరి నరేష్ చాలా అంచనాలే పెట్టుకున్నాడు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Selfie Raja  Allari Naresh  Sakshi Chaudhary  

Other Articles