కన్ఫర్మ్: సూపర్ స్టార్ తో ఎస్.జే.సూర్య ఢీ | SJ Surya Confirmed in Murugados Film

Sj surya confirmed in murugados film

Mahesh Babu Movie Updates, Mahesh Babu Murugados movie news, Mahesh Babu latest film updatets, Mahesh Murugados film, Mahesh Babu stills, AR Murugados film news

Superstar Mahesh babu upcoming film with tamil star director AR Murugados. Director SJ Surya plays negative role in this film.

కన్ఫర్మ్: సూపర్ స్టార్ తో ఎస్.జే.సూర్య ఢీ

Posted: 06/08/2016 01:03 PM IST
Sj surya confirmed in murugados film

తమిళ స్టార్ డైరెక్టర్ ఎఆర్.మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజిని, స్టాలిన్, తుపాకి, కత్తి చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించాయి. అలాంటిది మురుగదాస్ తో మహేష్ సినిమా అనగానే అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాలో తమిళ దర్శకుడు ఎస్.జే.సూర్య నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా దర్శకుడు మురుగదాస్ క్లారిటీ ఇచ్చేసాడు. తన సినిమాలో నెగెటివ్ పాత్రలో ఎస్.జే.సూర్య నటించనున్నాడని, అతనితో పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నట్లుగా మురుగదాస్ ట్వీట్ చేసాడు.

భారీ అంచనాలతో రూపొందనున్న ఈ సినిమా ఎలా వుండబోతుందో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ లుక్స్ పరంగానే కాకుండా చాలా కొత్త క్యారెక్టర్లో కనిపించనున్నాడని సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కానుందో చిత్ర దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  AR Murugados  SJ Surya  

Other Articles