కొంచెం ఓపికగా వుంటే ఫుల్ పబ్లిసిటీ | Rakul Preet Singh Clarifies on Injured

Rakul preet singh clarifies on injured

Rakul Preet Singh Clarifies on Injure, Rakul Preet Singh injured, Rakul Preet Singh tweets, Rakul Preet Singh movies, Rakul Preet Singh upcoming films, Rakul Preet Singh in Dhruva, Rakul Preet Singh latest stills, Rakul Preet Singh hot stills

Rakul Preet Singh Clarifies on Injure: Telugu star heroine Rakul Preet Singh Injured. Rakul Preet Singh clarifies on this news. Rakul upcoming dhruva with ram charan.

కొంచెం ఓపికగా వుంటే ఫుల్ పబ్లిసిటీ

Posted: 06/07/2016 04:09 PM IST
Rakul preet singh clarifies on injured

తెలుగులో వరుస సినిమాలతో బిజీగా వున్న స్టార్ హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్. ఇటీవలే ‘సరైనోడు’తో మరో హిట్టును సొంతం చేసుకుంది. ఈ సినిమాతో తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం రాంచరణ్ సరసన ‘ధృవ’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ అమ్మడు ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి అమెరికా వెళ్లగా.. అక్కడ గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న మీడియా వాళ్లంతా కూడా ‘రకుల్ కాలికి మరియు భుజాలకు తీవ్ర గాయాలయ్యాయి’ అంటూ తెగ వార్తలు రాసేస్తున్నారు. చివరకు ఈ వార్త రకుల్ చెవిలో పడి ఈ గాయలకు తనదైన శైలిలో పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చేసింది.

రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందిస్తూ... తనకు గాయాలైన వార్త నిజమే.. అది కూడా మెడకు మాత్రమే కానీ భుజానికి మరియు కాళ్లకు కాదు. ఆ గాయం తగ్గి మళ్లీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాను అంటూ ప్రకటించింది. రకుల్ క్షేమమని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఈ క్లారిటీ ఇవ్వకపోయి వుంటే మరో రెండు, మూడు రోజుల వరకు మీడియాలో ఇదే రచ్చ రచ్చ అయ్యేది. దీనివల్ల రకుల్ మరింత పాపులర్ అయ్యేది. కానీ అలాంటి బ్యాడ్ పబ్లిసిటీ ఇష్టపడని రకుల్ వెంటనే స్పందించడం.. నిజంగా గ్రేట్.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Ram Charan  Dhruva  

Other Articles