‘అఆ’కు రికార్డు స్థాయిలో రేటు | A Aa movie satellite rights

A aa movie satellite rights

A Aa movie satellite rights sold out, A Aa movie first day collections, A Aa movie public talk, A Aa movie review, A Aa movie collections, A Aa movie talk, A Aa movie news, A Aa movie theaters list, A Aa movie stills, A Aa movie

A Aa movie satellite rights: Trivikram Srinivas latest block buster film A Aa. Nithin, Samantha, Anupama parameshwaran acts in lead roles.

‘అఆ’కు రికార్డు స్థాయిలో రేటు

Posted: 06/03/2016 09:43 AM IST
A aa movie satellite rights

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘అఆ’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అన్నిచోట్ల థియేటర్లు హౌస్ ఫుల్ గా మారాయి. నితిన్, సమంత జంటగా అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాకు మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించాడు.

ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ్ టాక్ వుండటం, రిలీజ్ తర్వాత కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ‘అఆ’ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. తాజాగా ‘అఆ’ శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ జీ తెలుగు ఛానెల్ 6.07 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఇది నితిన్ కెరీర్లోనే రికార్డ్ అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషంగా వున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A Aa movie  Collections  Nithin  Samantha  

Other Articles