రచ్చ చేస్తున్న పూరీ కొత్త హీరో స్టైల్ | Kalyan Ram New Style for Puri Jagannadh film

Kalyan ram new style for puri jagannadh film

Kalyan Ram New Style for Puri Jagannadh film, Kalyan Ram latest look, Kalyan Ram hair style, Kalyan Ram movie updates, Kalyan Ram stills, Kalyan Ram, Puri Jagannadh movies, Puri Jagannadh tweets, Puri Jagannadh

Kalyan Ram New Style for Puri Jagannadh film: Nandamuri Kalyan ram upcoming film with director puri jagannadh. Aditi Arya heroine.

రచ్చ చేస్తున్న పూరీ కొత్త హీరో స్టైల్

Posted: 06/01/2016 11:24 AM IST
Kalyan ram new style for puri jagannadh film

టాలీవుడ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారంభమయ్యింది. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ తన హెయిర్ స్టైల్ పూర్తిగా, సరికొత్తగా మార్చేసుకున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ కొద్దిగా సన్నబడ్డట్లుగా కనిపిస్తున్నాడు.

గతంలో తన దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను పూర్తిగా మార్చేసాడు పూరీ. ‘టెంపర్’ ఎన్టీఆర్ బాడీ, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్... ఇలా అన్నింటిలో కూడా కొత్త స్టైల్ ను ప్రజెంట్ చేసాడు. పర్ఫెక్ట్ బాడీ, అందుకు తగ్గట్లుగా హెయిర్ స్టైల్ తో ‘టెంపర్’ సినిమాలో ఎన్టీఆర్ అదరగొట్టేసాడు. అలాగే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ను కూడా సరికొత్తగా చూపించబోతున్నాడు పూరీ.

ఇందులో కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మిస్ ఇండియా అదితి ఆర్య హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Kalyan Ram  NTR  

Other Articles