రికార్డింగ్ డాన్సుల్లో ‘పోకిరి’ భామ | Mumaith Khan Recording Dance

Mumaith khan recording dance

Mumaith Khan Recording Dance, Mumaith Khan dance video, Mumaith Khan turns recording dancer, Mumaith Khan dance 2016, Mumaith Khan in jathara, Mumaith Khan stills, Mumaith Khan hot videos, Mumaith Khan hot stills

Mumaith Khan Recording Dance: Tollywood hot item girl and actress Mumaith Khan Recording Dance Video Going Viral.

రికార్డింగ్ డాన్సుల్లో ‘పోకిరి’ భామ

Posted: 05/30/2016 12:56 PM IST
Mumaith khan recording dance

తెలుగులో ఐటెం సాంగ్స్ కు మళ్లీ ఓ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన భామ ముమైత్ ఖాన్. ‘పోకిరి’ సినిమాతో ముమైత్ ఖాన్ ఐటం సాంగ్ లకు ప్రాణం పోసింది. ఆ తర్వాత వరుసగా ముమైత్ ఖాన్ కు ఐటం సాంగ్స్ ఆఫర్లు రావడమే కాకుండా నటిగా కూడా అవకాశాలు వచ్చాయి. అంతే కాకుండా ముమైత్ ఖాన్ హీరోయిన్ గా కూడా నటించింది. తనకంటూ ఓ ప్రత్యేక స్టార్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

అలాంటి ముమైత్ ఖాన్ కు ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు లేకుండా పోయాయి. తెలుగులోనే కాదు.. దాదాపు చాలా చోట్ల ముమైత్ ఖాన్ కు అంతగా అవకాశాలు రావడం లేదని తెలిసింది. అయితే ఎంత ఆఫర్లు రాకపోయినప్పటికీ.. మరీ ఈ రేంజులో దిగజారడమేంటని ముమైత్ ఖాన్ పరిస్థితి చూసినవాళ్లంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.


Video Source: Amaravathi Media

ఇటీవలే భీమిలి మండలం చిప్పాడ గ్రామంలో సీతమ్మ తల్లి జాతర జరిగింది. అక్కడి వారు రికార్డింగ్ డాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముమైత్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ గా డాన్స్ చేసింది. ఇలాంటి రికార్డింగ్ డాన్సుల్లో ముమైత్ ఖాన్ చిందులేయడమేంటని అందరూ షాక్ అవుతున్నారు. ఈ కార్యక్రమం కోసం ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ విషయం పక్కకి పెడితే... అసలు ఎక్కడ కూడా తాను ఓ రికార్డింగ్ డాన్సు కార్యక్రమంలో పాల్గొన్నననే భావన రాకుండా ఎంజాయ్ చేస్తూ, డాన్స్ చేసి అక్కడివారినంతా అలరించింది.

ఒకప్పుడు తన స్టెప్పులతో టాలీవుడ్ ను ఒక ఊపుఊపేసిన ముమైత్ ఖాన్... ఇలా రికార్డింగ్ డాన్సులు చేయడమేంటనీ సినీ ఇండస్ట్రీ సైతం షాక్ అవుతుంది. నిజంగా ముమైత్ ఖాన్ పరిస్థితి ఈ రేంజుకు దిగజారిపోవడం భాధకరమనే చెప్పుకోవాలి. సినిమా వాళ్ల కష్టాలెంటో ముమైత్ ఖాన్ ‘నేనింతే’ సినిమాలో చాలా చక్కగా చెప్పింది. మరి ఇప్పటికైనా ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumaith Khan  Recording Dance  Hot stills  

Other Articles