పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత రాయుడుతో మరో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మాస్ విశాల్ కొత్త చిత్రం జూన్ 9 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. 'రాయుడు' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని ఇచ్చిన జి.హరి హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ఈ భారీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర విశేషాలను నిర్మాత జి.హరి మాట్లాడుతూ.... భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో చేస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. నిర్మాతగా నాకు చాలా ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. విశాల్ కెరీర్లో ఇది చాలా హై రేంజ్ మూవీగా నిలుస్తుంది. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. విశాల్‌తో నేను చేసిన 'రాయుడు' భారీ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా రిలీజ్ అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. 'రాయుడు' సూపర్‌హిట్ అయిన ఈ ఆనంద సమయంలో విశాల్‌తో స్ట్రెయిట్ సినిమా ఎనౌన్స్ చెయ్యడం మరింత ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం విశాల్ కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. విశాల్, తమన్నా జంట ఈ సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతుంది. ఇందులో జగపతిబాబుగారు మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే తరుణ్ అరోరా మరో విలన్‌గా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పాటల రికార్డింగ్ పూర్తయింది. జూన్ 9 నుంచి నెలరోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. మిగతా షెడ్యూల్స్ చెన్నై, ఫారిన్లలో చేస్తాం అన్నారు.
మాస్ హీరో విశాల్, తమన్నా, జగపతిబాబు, నిరోషా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సూరి, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్స్, ఎడిటింగ్: సెల్వ, ఫైట్స్: దినేష్, అనల్ అరసు, ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్.జి.ప్రేమానందన్, సహనిర్మాతలు: ఎం.పురుషోత్తం, ఇ.కె.ప్రకాష్, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more