ఎన్టీఆర్ మెచ్చిన బర్త్ డే గిఫ్ట్ అదే.. | NTR impressed with that unique gift

Ntr impressed with that unique gift

NTR, Young Tiger, NTR Birth Day, Junior NTR, Gift NTR, ఎన్టీఆర్, యంగ్ టైగర్, ఎన్టీఆర్ బర్త్ డే

Young Tiget NTR impress with Director Sukumars gift. Sukumar gifted a unique gift by remembering Naannku Prematho cinema with a watch.

ఎన్టీఆర్ మెచ్చిన బర్త్ డే గిఫ్ట్ అదే..

Posted: 05/21/2016 10:40 AM IST
Ntr impressed with that unique gift

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన బర్త్ డే వేడుకలను ఎంతో ఘనంగా చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఫ్యాన్స్ ఆశిస్సలుతో, వేల మంది గ్రీటింగ్స్ తో తన బర్త్ డేను గ్రాండ్ గా చేసుకున్నాడు. ఎంతో మంది తారక్ ఇంటికి వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పగా.. మరికొంత మంది తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక కొంత మంది బర్త్ డే బాయ్ కి గిఫ్ట్ లు కూడా ప్రజెంట్ చేశారు. అలా ఎన్టీఆర్ కు వచ్చిన ఓ గిఫ్ట్ తెగ నచ్చేసిందట. ఆ గిఫ్ట్ ఏంటా..? అనుకుంటున్నారా..? ఓ వాచ్. అవును ఓ వాచ్. దాని స్సెషాలిటీ ఏంటో తెలుసా..?

నందమూరి నటవారసుడు ఎన్టీఆర్ కు జీనియస్ డైరెక్టర్ సుకుమార్ ఓ అదిరిపోయే గిఫ్ట్ ను ప్రజెంట్ చేశాడు. తన క్రియేటివిటి మరోసారి ఆ గిఫ్ట్ రూపంలో బయటపెట్టారు సుకుమార్. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో తీసిన సుకుమార్ తన సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఓ వాచ్ ను డిజైన్ చేశారు. అందులో నాన్నకు ప్రేమతో టైటిల్ ను ఇంగ్లీష్ లో పెట్టారు, టైం అని రాశారు.. నాన్నకు ప్రేమతో లో పల్స్ మాదిరిగా అది కూడా కనిపించేలా డిజైన్ చేశారు.. రెండు బాల్స్ ను, గేమ్ ఓవర్ లాంటి డైలాగ్ ను కూడా ఆ వాచ్ లో పొందుపరిచారు. నాన్నకు ప్రేమతో సినిమా మొత్తం రివైండ్ చేసుకునేలా ఉన్న ఆ వాచ్ చాలా యునిక్ అని ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles