కత్తిలాంటోడి కోసం మ్యూజిక్ స్టార్ట్ | Devi Sri Prasad Music Starts for Chiranjeevi

Devi sri prasad music starts for chiranjeevi

Devi Sri Prasad Music Starts for Chiranjeevi, DSP Music starts for kaththilantodu, Devi Sri Prasad Music Starts, DSP Music Starts for Mega boss, Chiranjeevi 150film updates, Chiranjeevi movies, Chiranjeevi movie news, Chiranjeevi stills

Devi Sri Prasad Music Starts for Chiranjeevi: Megastar chiranjeevi 150th film with director VV Vinayak. Ram Charan Producer. DSP music.

కత్తిలాంటోడి కోసం మ్యూజిక్ స్టార్ట్

Posted: 05/14/2016 12:58 PM IST
Devi sri prasad music starts for chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికే సరైన కథకోసం ఇంతకాలం ఎదురుచూసారు. తమిళంలో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవ ముహూర్త కార్యక్రమాలను కూడా జరుపుకున్నారు.

దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. సౌత్ ఇండియన్ యువ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవి-దేవిల కాంబినేషన్లో అందరివాడు, శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ వంటి మ్యూజికల్ హిట్ చిత్రాలొచ్చాయి. సినిమాలు హిట్టు కాకపోయినప్పటికీ.. ఆ సినిమాల్లోని పాటలు మాత్రం ఇప్పటికీ దుమ్మురేపుతున్నాయి.

అయితే తాజాగా చిరంజీవి 150వ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అప్పుడే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించేసాడు. ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ విషయాన్ని దేవి తెలియజేస్తూ... ‘బాస్ తో కలిసి.... మెగాస్టార్ 150వ సినిమాకు మొదటిరోజు డిస్కషన్... వెలకమ్ బ్యాక్ సార్... వి లవ్యూ’ అంటూ చిరుతో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

అసలే ప్రస్తుతం తెలుగు, తమిళ వరుస సినిమాలతో ఫుల్ బిజీలో వున్న దేవి... మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడంటే... ఇక మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని సినీవర్గాలు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎలా వుంటుందో ఏమో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Devi Sri Prasad  Kaththilantodu  Ram Charan  

Other Articles