చైతూ పెళ్లి రిసెప్షన్ వేడుక | Naga Chaitanya Marriage Reception

Naga chaitanya marriage reception

Naga Chaitanya Marriage Reception, Naga Chaitanya Wedding Reception, Naga Chaitanya Reception stills, Naga Chaitanya Premam, Naga Chaitanya movie updates, Naga Chaitanya stills, Madonna Sebastian hot stills, Shruti Haasan, Anupama parameshwaran

Naga Chaitanya Marriage Reception: Akkineni Naga Chaitanya upcoming film Premam. Shruti Haasan, Anupama parameshwaran, Madonna Sebastian heroines.

చైతూ పెళ్లి రిసెప్షన్ వేడుక

Posted: 05/10/2016 05:06 PM IST
Naga chaitanya marriage reception

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యిన ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ లో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, శృతిహాసన్, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే శృతిహాసన్, నాగచైతన్యలకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం చైతూ-మడోన్నాలకు మధ్య క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీరిద్దరి వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాలో హీరోహీరోయిన్లు ఎలాంటి లుక్ తో కనిపించారో.. ఈ రీమేక్ లో కూడా అలాగే చూపిస్తున్నారు తప్ప కొత్తగా ఏం చూపించడంలేదని అనుమానాలు కలుగుతున్నాయి. ఇలా దాదాపు అన్ని విషయాల్లో ఆ సినిమా పోలీకలు కనిపించడంతో... కొత్తగా ఎలాంటి తేడా కనిపించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బ్యూటీఫుల్ లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Premam  Shruti Haasan  Anupama parameshwaran  

Other Articles