lavanya tripati bonces back in her cine career

Tollywood actress lavanya tripati busy with four films

Andala rakshasi, sogade chinni nayana, Lavanya tripati, lavanya tripati busy with 4 films, varun tej, Sharwanand, Sandeep kishan, allu shirish, tollywood

Andala rakshasi fame lavanya tripati bonces back in her cine career with four films in her hand

బిజీబిజీగా మారిన సోగ్గాడి సిన్నది..

Posted: 05/08/2016 03:15 PM IST
Tollywood actress lavanya tripati busy with four films

ఒక్కోసారి ఒక్కోరకంగా స్టార్ తిరుగుతుంది. మొన్నామధ్య గబ్బర్ సింగ్ చిత్రంతో శృతి హసన్ కెరీర్ టార్న్ అవ్వగా, అత్తరింటికి దారేది చిత్రంతో ప్రణిత గ్రాఫ్ తిరిగింది. అంతకుముందు వారు ఎంతో అకుంఠిత దీక్షతో నటించిన చిత్రాలు హిట్ కాకపోవడం ఇందుకు కారణం కావచ్చు. సినిమాలు హిట్ అయినా.. నటీమణులకు అదృష్టం కలసిరాక అవకాశాలు రాకపోనే వచ్చు. సరిగ్గా అందాల రాక్షసి చిత్రంతో అన అభినయాన్ని పరిక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మెప్పించిన లావణ్య త్రిపారీ కూడా అంతే.

స్టార్టింగ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ అవుతుందీ అమ్మడు. తన తొలి సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయినా, తన క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో లావణ్య నటనకు మంచి రెస్పాన్స్ వచ్చినా.. అవకాశాలు మాత్రం నిల్. కానీ సీనియర్ హీరో నాగార్జున సరసన నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా లావణ్య ఫేట్ మార్చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా ఘన విజయం సాదించటంతో లావణ్య త్రిపాఠికి వరుస అవకావాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలందరూ ఈ అమ్మడితో కలిసి నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఇప్పటికే అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన శ్రీరస్తూ శుభమస్తూ సినిమా షూటింగ్ పూర్తి చేసిన లావణ్య, మరో మూడు సినిమాలకు ఓకె చెప్పేసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు లావణ్య త్రిపాఠిని హీరోయిన్గా కన్ఫామ్ చేశారు. ఈ ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా, శర్వానంద్ హీరోగా బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త సినిమాల్లో కూడా లావణ్యనే హీరోయిన్గా నటిస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తే లావణ్య కూడా త్వరలో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటదని సినీ పండితుల అంచనా.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lavanya tripati  varun tej  Sharwanand  Sandeep kishan  allu shirish  tollywood  

Other Articles