హాలీవుడ్ లో బాస్మతితో మంచులక్ష్మీ | Manchu Lakshmi in Hollywood Film

Manchu lakshmi in hollywood film

Manchu Lakshmi in Hollywood Film, Manchu Lakshmi in BASMATI BLUES, Manchu Lakshmi latest stills, మంచు లక్ష్మీ, హాలీవుడ్, సినిమాలు, వార్తలు, Manchu Lakshmi photoshoot, Manchu Lakshmi traditional, రాజకీయాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, Spicy Videos, Movies, News, Gossips, Sports, Fashion, Style, Comedy, Hotels, Tickets, Manchu Lakshmi hot stills, Manchu Lakshmi hollywood films, Manchu Lakshmi tweets, Manchu Lakshmi spicy stills

Manchu Lakshmi in Hollywood Film: after working in famous television series like LAS VEGAS , BOSTON LEGAL ,MYSTERY ER ,DESPERATE HOUSE WIFES & Few hollywood movies. once again lakshmi manchu’s stardom is going to hit on screens of HOLLYWOOD with BASMATI BLUES film.

హాలీవుడ్ లో బాస్మతితో మంచులక్ష్మీ

Posted: 05/07/2016 03:37 PM IST
Manchu lakshmi in hollywood film

త‌న ప్ర‌తిభ‌ను బహుముఖంగా ప్ర‌ద‌ర్శిస్తూ టాలీవుడ్ లో విల‌క్ష‌ణ న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు ల‌క్ష్మి ఇప్ప‌టికే లాస్ వేగాస్, ఈఆర్, డెస్ప‌రేట్ హౌస్ వైఫ్ లాంటి టెలివిజ‌న్ సీరియ‌ల్స్ తో పాటు, హాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించింది. మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత మంచు ల‌క్ష్మి హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లో చేస్తున్న సినిమా ‘బాస్మతి బ్లూస్’. ఈ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం ఇండియాలోనే జ‌రిగింది. ఇటీవల అమెరికా వెళ్ళిన లక్ష్మి ఈ సినిమాకు సంబంధించిన తన డబ్బింగును కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ద‌శ‌లో ప‌నులు జరుగుతున్నాయి.

‘బాస్మతి బ్లూస్’ సినిమాలో బ్రీ లార్సన్ , డోనాల్డ్ సతర్లాండ్ , స్కాట్ బకుల ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందులో మంచులక్ష్మీ ‘సీత’ పాత్రలో నటించింది. డాన్ బారోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మేనిక్యూ కాల్ ఫీల్డ్ నిర్మించాడు. ఈ సినిమా ఓ సైంటిస్ట్ క‌థ‌. తాను సృష్టించిన కొత్త వరివంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకు వచ్చే ఓ శాస్త్రవేత్త … ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? మధ్యలో అతని జీవితం, ప్రేమ‌ ఎలాంటి మలుపులు తిరిగాయ‌నే అంశాల‌తో ఈ సినిమా రూపొందుతోంది. విడుద‌ల‌కు సిద్ద‌మైన ఈ చిత్రాన్ని పెద్ద మొత్తంలో AMBI డిస్ర్టిబ్యూష‌న్ సంస్థ చేజిక్కించుకుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ సినిమాలో ల‌క్ష్మి మంచు పాత్ర కీలకమనే వార్త ఇంట‌ర్నేష‌నల్ మీడియాలోనూ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఎలాగైతే కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తోందో.. సినిమా సినిమాకు ఒక డిఫ‌రెంట్ యాంగిల్ ను చూపిస్తూ మంచు ల‌క్ష్మికూడా త‌న‌దైన శైలిలో దూసుకుపోతూ త‌న ప్ర‌తిభ‌ను క‌నబ‌రుస్తోంది.

సినిమా: బాస్మతి బ్లూస్
నటీనటులు: బ్రీ లార్సన్, డోనాల్డ్ సతర్లాండ్, స్కాట్ బకుల, టైన్ డలీ, ఉత్కర్ష్ అంబుద్కర్, మంచు లక్ష్మీ, సాహిల్ సెహగల్, ఫగున్ థార్కర్.
సాంకేతికవర్గం: సినిమాటోగ్రఫి- హిమ్మన్ దామిజా, మ్యూజిక్- స్టీవెన్ అర్గిలా, స్ర్కిప్ట్- దాన్ బారోన్&జెఫ్ డొర్చెన్, ప్రొడక్షన్- మోనిక్ కాల్ఫిల్డ్&జెఫ్రే సోరొస్, డైరెక్షన్- దాన్ బారోన్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Hot Stills  Movie Stills  

Other Articles