విదేశాల్లో మూడు.. వైజాగ్ లో రెండు | Jakkanna Movie Release on June

Jakkanna movie release on june

Jakkanna Movie Release on June, Jakkanna Movie updates, Jakkanna Movie stills, Jakkanna Movie posters, Sunil movies, Sunil stills, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, News, Gossips, Sports, Fashion, Style, Hot, Comedy, Spicy, Hotels, Tickets, Gallery

Jakkanna Movie Release on June: Actor Sunil upcoming film Jakkanna. Vamsi Akella director. Mannar Chopra heroine.

విదేశాల్లో మూడు.. వైజాగ్ లో రెండు

Posted: 05/07/2016 09:02 AM IST
Jakkanna movie release on june

వరుసగా విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని సందడి చేస్తున్న సునీల్ హీరోగా... మన్నార్ చోప్రా హీరోయిన్ గా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన జక్కన్న ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శరవేగంగా షూటింగ్ జరపుకున్న జక్కన్న టాకీ పార్ట్ పూర్తయింది. మే లో విదేశాల్లో 3 పాటల్ని, వైజాగ్ లో రెండు పాటల్ని చిత్రీకరించనున్నారు. దీంతో మే నెలాఖ‌రుకి చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. త్వ‌ర‌లో ఆడియో విడుదల చేసి, జూన్ మూడ‌వ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...... సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. సునీల్ పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. ఈ చిత్రానికి జక్కన్న అనే టైటిల్ పర్ ఫెక్ట్ గా సరిపోతుంది. డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అందరినీ అలరిస్తుంది. ప్రేమకథా చిత్రంలో ఎన్ని ట్విస్టులుంటాయో ఈ సినిమాలో కూడా అన్ని ట్విస్టులుంటాయి. మే 11 నుంచి విదేశాల్లో మూడు పాట‌ల్ని చిత్రీకరించనున్నాం. ఆ తర్వాత వైజాగ్ లో రెండు పాటల్ని చిత్రీకరిస్తాం. దీంతో మే నెలాఖ‌రుకి చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు డ‌బ్బింగ్‌, ఎడిటింగ్ ప‌నులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వ‌ర‌లో ఆడియో విడుదల చేసి... జూన్ మూడ‌వ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని అన్నారు.

నటీనటులు.... సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, ఉదయ్, ఆనంద్ రాజ్, సత్య, వైవా హర్ష, వేణుగోపాల్, రాజశ్రీ నాయర్ తదితరులు.

సాంకేతిక వర్గం...బ్యానర్ - ఆర్ పి ఏ క్రియేషన్స్; సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్; మ్యూజిక్: దినేష్; ఆర్ట్ డైరెక్టర్ - మురళి; ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్ ; ఎడిటర్: ఎం.ఆర్.వర్మ; డైలాగ్స్: భవాని ప్రసాద్; స్టిల్స్ - వాసు; పిఆర్ఓ - ఏలూరు శ్రీను; కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి; నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jakkanna  Sunil  Mannar Chopra  Hot Stills  

Other Articles