హీరోయిన్ తో అర్థరాత్రి రహస్యంగా...? | Arjun Kapoor late night with Malaika Arora

Arjun kapoor late night with malaika arora

Arjun Kapoor late night visit to Malaika Arora, Arjun Kapoor late night with Malaika Arora, Arjun Kapoor with Malaika Arora, Arjun Kapoor and Malaika Arora love, Arjun and Malaika love story, Arjun Kapoor meets Malaika Arora, Malaika Arora hot stills, Malaika Arora hot videos, Malaika Arora photoshoot, Malaika Arora stills, Arjun Kapoor movies, Arjun Kapoor stills, Arjun Kapoor love stories, Arjun Kapoor news, Arjun Kapoor affair

Arjun Kapoor late night visit to Malaika Arora: As per latest bollywood reports... Arjun Kapoor went to meet Malaika Arora at her residence in Mumbai.

హీరోయిన్ తో అర్థరాత్రి రహస్యంగా...?

Posted: 05/05/2016 06:44 PM IST
Arjun kapoor late night with malaika arora

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ మలైకా అరోరా తన భర్త అర్భాజ్ ఖాన్ (సల్మాన్ ఖాన్ సోదరుడు) నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. గతకొద్ది రోజులుగా వీరిద్దరూ విడిగా వుంటున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ కారణమని, మలైకాకు అర్జున్ కపూర్ తో ఎఫైర్ వుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఎఫైర్ వార్తలపై అర్జున్ కపూర్-మలైకా అరోరాలు ఏ విధంగా కూడా స్పందించకపోవడంతో.. ఈ వార్తల్లో నిజం వుందని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తలను నిజం చేసే విధంగా తాజాగా మలైకా ఇంటివద్ద అర్జున్ కపూర్ మీడియా ఫోటోగ్రాఫర్ల కంటపడ్డాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చినట్లుగా అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ముంబైలోని ఖర్ లో మలైకా నివాసం వుంటున్న ఫ్లాట్ కు అర్జున్ కపూర్ అర్థరాత్రి రహస్యంగా వచ్చాడు. వీరిద్దరి ప్రేమాయణం బయటపెట్టేందుకు గతకొద్ది కాలంగా సీక్రెట్ గా ఫాలో అవుతున్న మీడియా ఫోటోగ్రాఫర్లకు వీరిద్దరూ ఎట్టకేలకు దొరికిపోయారు. ఈ విషయాన్ని ఓ ఫోటోగ్రాఫర్ ఇంగ్లీష్ డైలీకి తెలియజేస్తూ... తాము మలైకా ఇంటి బయట రహస్యంగా వున్నామని, అర్థరాత్రి దాటిన తర్వాత అర్జున్ కపూర్ తన కారులో వచ్చాడని తెలిపారు. ముందుగా తన కార్ డ్రైవర్ దిగి, బయట ఫోటోగ్రాఫర్లు ఎవరూ లేరని తెలిసాక.. అర్జున్ కపూర్.. మలైక ఇంట్లోకి వెళ్లిపోయాడని, అక్కడ అర్జున్ చాలా సమయం పాటు గడిపాడని తెలిపారు.

అయితే కాసేపటి తర్వాత పోలీసులు వచ్చి తమను అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పారని, అర్జున్ కపూర్ ఫోన్ చేసి చెప్పడం వల్లనే తాము వచ్చినట్లుగా పోలీసులు తెలిపారని చెప్పుకొచ్చారు. మొత్తానికి వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై రోజురోజు మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. అర్భాజ్ ఖాన్ తో మలైకా విడిపోవడానికి గల కారణం అర్జున్ కపూర్ తో ప్రేమాయణమే కారణమని బాలీవుడ్ జనాలు భావిస్తున్నారు.

గతంలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ తో అర్జున్ కపూర్ ప్రేమాయణం సాగించాడు. మలైకాతో ఎఫైర్ పెట్టుకొని అర్పితను మోసం చేసాడనే ఆరోపణలు కూడా వున్నాయి. అయితే ప్రస్తుతం అర్పిత మాత్రం ఆయుష్ శర్మను వివాహం చేసుకొని, ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి సంతోషంగా వుంది. మరి అర్జున్ కపూర్ - మలైకా అరోరాల ప్రేమ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Kapoor  Malaika Arora  Photoshoot  

Other Articles