బాలయ్య ఛాన్స్ ఎలా మిస్ అయ్యిందంటే? | Anil Ravipudi clarifies on balakrishna 100th film offer

Anil ravipudi clarifies on balakrishna 100th film offer

Anil Ravipudi talks about balakrishna 100th film offer, Anil Ravipudi interview, Supreme theaters list, Supreme movie tickets, Supreme online booking, సుప్రీమ్, సాయిధరమ్ తేజ, రాశిఖన్నా, అనిల్ రావిపూడి, Supreme movie posters, Supreme songs, Supreme collections, Supreme stills, రాజకీయాలు, వార్తలు, హాస్యం, కామెడీ, fun, entertainment, comedy, films, movies, stills, hot, cinema, sports, fashion

Anil Ravipudi clarifies on balakrishna 100th film offer: tollywood director Anil Ravipudi latest film Supreme. Saidharam tej, Rashi khanna acts in lead roles. Sai Karthik Music.

బాలయ్య ఛాన్స్ ఎలా మిస్ అయ్యిందంటే?

Posted: 05/04/2016 06:49 PM IST
Anil ravipudi clarifies on balakrishna 100th film offer

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ప్రారంభానికి ముందుగా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. వారిలో ‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి కూడా ఒకరు. ‘పటాస్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్న అనిల్ రావిపూడి... పర్ఫెక్ట్ కమర్షియల్ హిట్ ను ‘పటాస్’ ద్వారా సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ... కమర్షియల్ హిట్ తో పాటు కాసుల వర్షం కురిపించే సినిమాను అందించినందుకు అనిల్ కు ప్రశంసలు దక్కాయి.

ఇదిలా వుంటే తన రెండవ చిత్రం బాలయ్య 100వ సినిమాగా రూపొందనుందని గతంలో వార్తలొచ్చాయి. బాలయ్య 100వ సినిమాకు అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్ సరైన ఛాయిస్ కాదని పుకార్లు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజానిజాలు ఏంటో అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించారు.

తాజాగా అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అప్పట్లో బాలయ్యకు తాను ఓ స్టోరీలైన్ చెప్పిన విషయం నిజమేనని.. అది బాలయ్యకు బాగా నచ్చడంతో ఏప్రిల్ నెల లోపు పూర్తి కథ సిద్ధం చేయమని తనను అడిగారని.. కానీ ‘సుప్రీం’ సినిమా పనులు వల్ల బిజీగా వుండటం వల్ల ఆ కథ పూర్తిచేయలేకపోయానని అనిల్ చెప్పుకొచ్చాడు. అయితే త్వరలోనే ఆ కథ పూర్తి చేసి, బాలయ్యను కలుస్తానని అనిల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ప్రస్తుతం అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుప్రీమ్’ సినిమా రేపు(మే 5) ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల కానుంది. సాయిధరమ్ తేజ, రాశిఖన్నా జంటగా నటించిన ఈ సినిమాను శిరీష్ నిర్మించారు. సాయికార్తీక్ సంగీతం అందించిన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకోనుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme  Saidharam Tej  Rashi khanna  

Other Articles