కత్తిలాంటోడు సినిమా స్టార్ట్.. హైలెట్ అదే | MEGASTAR’S COMEBACK FILM LAUNCHED

Megastar s comeback film launched

Chiranjeevi, VV Vinayak, Chiru 150th film, Allu Aravind, Kaththi, Kathilantodu, Chiru, Ramm Charan, Konedala productions, వినాయక్, చిరంజీవి, చిరు 150వ సినిమా, కత్తిలాంటోడు

Megastar Chiranjeevi is making his comeback to mainstream cinema after a gap of almost nine years. Sensational director VV Vinayak has been roped in to direct this mass entertainer which is the remake of Tamil blockbuster Kaththi. Vinayak has taken his time to transform the script completely to suit the Telugu nativity.

కత్తిలాంటోడు సినిమా స్టార్ట్.. హైలెట్ అదే

Posted: 04/29/2016 05:39 PM IST
Megastar s comeback film launched

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కత్తిలాంటోడుకు మొత్తానికి ముహూర్తం కుదిరింది. ఈ మధ్యాహ్నం 1గంట 30 నిమిషాలకు లాంఛనంగా ప్రారంభమైంది.తమిళ్ లో భారీ హిట్ అయిన విజయ్ సినిమా కత్తిని రీమేక్ గా చేస్తున్నారు. వి వి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ కత్తి,ి తెలుగు కత్తిలాంటోడికి కథలో చిన్న మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా, మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా స్టోరీలో కొన్ని మార్పులు చేసినట్లు వినాయక్ వెల్లడించారు.

చిరంజీవి కత్తిలాంటోడు సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చేశారు(ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప) అల్లు అరవింగ్, నాగబాబు, రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, నిహారికలతో సహా అందరూ పాలుపంచుకున్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విజయ్ తమిళంలో నటించిన కత్తి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. జూన్ మొద‌టివారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ పాత్రలో మెరిపించనున్నట్లు తెలుస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles