ఆరోజే ధనుష్ ‘మాస్’ విడుదల | Dhanush Mass Release on 29 April

Dhanush mass release on 29 april

Dhanush Mass release date, Dhanush Mass stills, Dhanush Mass movie updates, Dhanush stills, Dhanush movies, Dhanush, Kajal

Dhanush Mass Release on 29 April: Tamil star hero dhanush latest film maari. this film will be release on 18 march in telugu with Mass title. kajal heroine.

ఆరోజే ధనుష్ ‘మాస్’ విడుదల

Posted: 04/27/2016 03:11 PM IST
Dhanush mass release on 29 april

ధనుష్- కాజల్ జంటగా తమిళంలో మంచి విజయం సాధించిన "మారి" తెలుగులో "మాస్" పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. "వి. ఎం. అర్" సమర్పణలో జయప్రద పిక్చర్స్ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. "లవ్ ఫెయిల్యూర్" ఫేం బాలాజీ మోహన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి "వై దిస్ కొలవేరి ఫేం" అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నారు.

నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడుతూ.. "ధనుష్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామర్, అనిరుధ్ మ్యూజిక్, సాహితి అందించిన మాటలు-పాటలు బాలాజీ మోహన్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం "మాస్" చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ నూ అమితంగా అలరించే చిత్రమిది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది" అన్నారు.

విజయ్ ఏసుదాస్, రోబో శంకర్ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సమర్పణ: "వి.ఎం.ఆర్", నిర్మాత: వాసిరెడ్డి పద్మకరరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: బాలాజీ మోహన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Kajal  Maari  

Other Articles