గోపిచంద్ తో హ్యాట్రిక్ కు సిద్ధం? | Gopichand Next Film With Sriwaas

Gopichand next film with sriwaas

Gopichand upcoming film details, Gopichand next film with Sriwaas, Gopichand with Sriwaas, Gopichand movie news, Gopichand movies, Gopichand latest stills, Gopichand stills, Gopichand

Gopichand Next Film With Sriwaas: Tollywood actor Gopichand next film with director sriwaas. After Lakshyam, Loukyam films again sriwaas and Gopichand work together.

గోపిచంద్ తో హ్యాట్రిక్ కు సిద్ధం???

Posted: 04/27/2016 10:06 AM IST
Gopichand next film with sriwaas

హీరో గోపిచంద్ తో ‘లక్ష్యం’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్న దర్శకుడు శ్రీవాస్... ఆ తర్వాత మళ్లీ గోపిచంద్-శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లౌక్యం’ సినిమా ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. ఇపుడు వీరిద్దరి కాంబినేషన్లో హ్యట్రిక్ సినిమా రాబోతుంది. ఇటీవలే బాలయ్యతో ‘డిక్టేటర్’ వంటి పవర్ ఫుల్ సినిమాను రూపొందించిన శ్రీవాస్ కు.. ఆ సినిమా విజయం మంచి కిక్కిచ్చింది.

దీంతో తన తదుపరి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక గోపిచంద్ తో తాను చేయబోయే తాజా చిత్రం గురించి శ్రీవాస్ మాట్లాడుతూ... గోపీచంద్ హీరోగా, నా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాను. మా కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం లాంటి బ్లాక్ బస్టర్ట్స్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గకుండా మా కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలకు మించి ఉండేలా భారీగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం గోపిచంద్ హీరోగా ఎ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ‘ఆక్సిజన్’ సినిమా రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని, వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  Sriwaas  Oxygen  

Other Articles

Today on Telugu Wishesh