శ్రీకాంత్ కు ఝలక్ ఇచ్చిందెవరు? | HC orders to Mental Police Film Unit

Hc orders to mental police film unit

High Court orders to Mental Police Movie Unit, Mental Police title issue, HC orders to Mental Police, Srikanth Mental Police movie updates, Mental Police movie stills, Srikanth latest films, srikanth stills

HC orders to Mental Police Film Unit: Telugu hero Srikanth upcoming film Mental Police. High Court orders to change this film title.

శ్రీకాంత్ కు ఝలక్ ఇచ్చిందెవరు?

Posted: 04/25/2016 03:42 PM IST
Hc orders to mental police film unit

పోలీసుల మనోభావాలు దెబ్బతినకుండా సినిమాలు తీయాలని ఇటీవలే పోలీసు అధికారుల సంఘం హెచ్చరించిన విషయం తెలిసిందే. విజయ్ నటించిన ‘తేరి’ చిత్రాన్ని ముందుగా ‘పోలీసోడు’ పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విడుదలకు ఒకరోజు ముందుగా పోలీసులు ఆదేశాల ప్రకారం ‘పోలీస్’ అనే టైటిల్ గా మార్చారు. ‘పోలీస్’ అనే టైటిల్ గా మార్చినప్పటికీ.. థియేటర్ల ముందు మాత్రం ‘పోలీసోడు’ అనే టైటిల్ తో పోస్టర్లు దర్శనమిచ్చాయి.

ఇదిలా వుంటే శ్రీకాంత్ సినిమాకు పోలీసుల సంఘం నుంచి హెచ్చరికలు వచ్చాయి. శ్రీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘మెంటల్ పోలీస్’. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. అయినా కూడా టైటిల్ మార్చకుండా చిత్ర యూనిట్ ఆలస్యం చేయడంతో పోలీసు అధికారుల సంఘం ఈ సినిమాపై కోర్టులో కేసు వేసారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన హైకోర్టు... వెంటనే ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ ఆదేశాలను జారీ చేసింది.

మరి కోర్టు తీర్పుతో ఎలాంటి టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి. అసలే గతకొద్ది కాలంగా శ్రీకాంత్ కు సరైన హిట్టులేక సతమతమవుతున్నాడు. తాజాగా శ్రీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన ‘సరైనోడు’ చిత్రం మంచి టాక్ తో నడుస్తోంది. ఇందులో శ్రీకాంత్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mental Police  Srikanth  Sarrainodu  

Other Articles