ఈనెల 29న ‘రాజా చెయ్యి వేస్తే’ విడుదల | Raja Cheyyi Veste Film Release Date

Raja cheyyi veste film release date

Raja Cheyyi Veste Release Date, Raja Cheyyi Veste movie stills, Raja Cheyyi Veste posters, Raja Cheyyi Veste teaser, Raja Cheyyi Veste audio updates, Nara rohith

Raja Cheyyi Veste Film Release Date: Nara Rohith upcoming film Raja Cheyyi Veste. This film will be release on 29 April. Sai Karthik music.

ఈనెల 29న ‘రాజా చెయ్యి వేస్తే’ విడుదల

Posted: 04/23/2016 10:58 AM IST
Raja cheyyi veste film release date

బాణం సినిమా నుండి డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటుడు నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’. ఈగ’, ‘అందాల రాక్షసి’, ’లెజండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ‘వారాహిచలనచిత్రం’ బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇలా నారా, నందమూరి హీరోలు కథనాయకుడు, ప్రతినాయకుడు పాత్రల్లో నటిస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది.

మురారి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohith  Raja Cheyyi Veste  Balakrishna  

Other Articles