గతకొద్ది రోజులుగా బాలీవుడ్ ప్రేమజంట వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తుంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ కంగనా రనౌత్ ల ప్రేమ వ్యవహారం ముదిరి, ఒకరిమీద ఒకరు కామెంట్లు చేసుకొని, చివరకు కోర్టు మెట్లు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరిద్దరూ కూడా ఒకరిపై ఒకరు కోర్టు ద్వారా లీగల్ కేసులతో గొడవ పడుతున్నారు.
కంగనా మీడియాతో ఎప్పుడూ మాట్లాడినా కూడా తన పేరును ప్రస్తావిస్తుందని, కాబట్టి చేసిన తప్పుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పాలని కంగానాకు హృతిక్ లీగల్ నోటీసులు పంపించాడు. అయితే కంగనా కూడా హృతిక్ పై ఆయా చట్టాల కింద కేసులు నమోదు చేయించి, హృతిక్ కు నోటిసులు పంపించింది. తనకు రోజుకు హృతిక్ నుంచి 50 మెయిల్స్ వచ్చేవని, అలాగే తన హృతిక్ మెయిల్ నుంచి చెత్త ఫోటోలు, వీడియోలు వచ్చేవని, తనను ప్రైవేట్ పార్టీలకు పిలిచేవాడని కంగనా ఆరోపించింది.
ఇలా వీరి రచ్చ ఎక్కువ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో హృతిక్ రోషన్ తప్పు ఏమి లేదని తేలింది. కంగనాకు హృతిక్ ప్రేమ పేరుతో ఎలాంటి ఈమెయిల్స్ పంపలేదని, కానీ కంగనా నుండి మాత్రం ఆరు నెలల వ్యవధిలో దాదాపు 3వేల ఈమెయిల్స్ హృతిక్ కు వచ్చాయని తేలింది. అయితే హృతిక్ పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, కంగనాకు ఈమెయిల్స్ పంపించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కంగనాకు హృతిక్ పేరుతో వచ్చిన ఈమెయిల్స్ కు హృతిక్ రోషన్ కు ఎలాంటి సంబంధం లేదని తేలింది.
ఇక హృతిక్ రోషన్ ఫోన్ కాల్స్ ను కూడా పరిశీలించిన పోలీసులు... ఈ ఏడేళ్లలో కేవలం నాలుగుసార్లు మాత్రమే కంగనాతో హృతిక్ మాట్లాడాడని తేలింది. ఇక కంగనాను కలిసేందుకు హృతిక్ ప్యారిస్ వెళ్లాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అతని పాస్ పొర్ట్ రికార్డుల ద్వారా బయటపడింది. మొత్తానికి ఈ వివాదంలో హృతిక్ రోషన్ తప్పేమి లేదని తేలింది. కంగనా నుంచి హృతిక్ తనకు వచ్చిన ఈమెయిల్ కాపీలను పోలీసులకు అందజేసారు. కానీ ఆ ఈమెయిల్ కాపీలు బయటకు లీక్ అయ్యాయి. మరి హృతిక్ తప్పు ఏం లేదని తెలియడంతో కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more