నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన కె. రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లతో పాటు పలువురు ప్రముఖులు మరియు బాలయ్య అభిమానులు విచ్చేసారు.
అయితే తన సినిమాకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా తన బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని బాలయ్య తప్పకుండా ఆహ్వానిస్తాడు. అలాంటిది బాలయ్య 100వ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు రాకపోవడంతో టిడిపి కార్యకర్తల్లో కాస్త అసంతృప్తి కనిపించింది. చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు వచ్చివుంటే ఆ సందడి మరో రేంజులో వుండేదని అక్కడికొచ్చిన వారంతా గుసగుసలాడారు.
ఎందుకంటే అసలే బాలయ్య 100చిత్రం కావడం ఒక కారణమైతే... ఇద్దరూ చంద్రులు(కేసిఆర్, చంద్రబాబు) ఒకే వేదికపై అగ్ర తారలతో(బాలయ్య, చిరంజీవి, వెంకటేష్) కలిసి కనిపిస్తే అటు అభిమానులు, ఇటు ప్రజలకు ఎంతో ఆనందంగా వుండేది. కానీ చంద్రబాబు రాకపోవడంతో కాస్త టిడిపి కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. అయితే చంద్రబాబుకు ఆహ్వానం అందిందో లేదో అని టిడిపి కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు రానిలోటును కేసిఆర్ భర్తీ చేసారని చెప్పుకోవచ్చు. కేసిఆర్ తన మాటలతో టిడిపి కార్యకర్తలు, బాలయ్య అభిమానులతో సైతం విజిల్స్ వేయించారు.
ఇక ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున మరియు మంచు మోహన్ బాబులు కూడా హాజరు కాలేదు. నాగార్జున మరియు మోహన్ బాబులతో బాలయ్యకు మంచి స్నేహమే వుంది. మరి ఈ కార్యక్రమానికి వీరిద్దరూ ఎందుకు హాజరుకాలేదు? అసలు బాలయ్య వీరికి ఆహ్వానం అందించలేదా? ఈ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది.. అలాంటిది నాగార్జునను బాలయ్య ఎందుకు ఆహ్వానించకుండా వుంటాడు? ఒకవేళ నాగార్జున, మోహన్ బాబులకు ఆహ్వానం అందినప్పటికీ.. వేరే ఇతర పనుల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారా? అని అక్కడికి వచ్చినవారితో పాటు ఈ కార్యక్రమాన్ని టీవి ఛానెల్లలో లైవ్ గా చూసినవాళ్లంతా గుసగుసలాడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more