నడిగర్ సంఘం నుంచి శింబు ఔట్ | Actor Simbu quits from nadigar sangam

Actor simbu quits from nadigar sangam

Simbu quits from nadigar sangam, Simbu quits, nadigar sangam details, nadigar sangam latest updates, శింబు, నడిగర్ సంఘం, విశాల్, కార్తీ, nadigar sangam cricket match, nadigar sangam members, రాధిక, శరత్ కుమార్, నాజర్, వార్తలు, రాజకీయాలు, nadigar sangam president, Vishal nadigar sangam, Simbu latest updates, Simbu stills

Simbu quits from nadigar sangam: Tamil actor simbu wants to quits from nadigar sangam. simbu unhappy with nadagar sangam team.

నడిగర్ సంఘం నుంచి శింబు ఔట్?

Posted: 04/21/2016 09:22 AM IST
Actor simbu quits from nadigar sangam

తమిళ యువ నటుడు శింబు నడిగర్ సంఘం నుంచి తప్పుకుంటున్నాని ప్రకటించాడు. ఈ ఏడాది తమిళ నడిగర్ సంఘం ఎన్నికలు నిజజీవిత రాజకీయాల ఎలక్షన్లను తలపించే విధంగా పోటాపోటీగా జరిగాయి. 2006 నుంచి 2015 వరకు నడిగర్ సంఘం అధ్యక్ష పదవిలో నటుడు శరత్ కుమార్ వున్నారు. అయితే శరత్ కుమార్ ను ఏలాగైనా ఓడించాలనే ఉద్దేశ్యంతో నటులు నాజర్, యువ హీరోలు విశాల్, కార్తీ తదితరులు భారీ ఎత్తున ప్రచారం చేసి, ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు.

శరత్ కుమార్ కు సపోర్ట్ చేస్తూ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన శింబుకు నిరాశే మిగిలింది. అయితే నాజర్ అధ్యక్షుడిగా ఎన్నికైనా తర్వాత ఎలాంటి సమస్యలలో కూడా సహాయం అందించట్లేదని శింబు ఆవేదన వ్యక్తం చేసారు. ఏ నటీనటులకైనా సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కారించడానికి నడిగర్ సంఘం ముందుకు రావాలని, కానీ తనకు సమస్యలు ఎదురైనప్పుడు నడిగర్ సంఘం ఎలాంటి సహాయం చేయలేదని శింబు ఆవేదన వ్యక్తం చేసాడు.

అలాగే ఇటీవలే నిర్వహించిన స్టార్ క్రికెట్ మ్యాచ్ పట్ల కూడా శింబు అసంతృప్తిని వ్యక్తం చేసాడు. ఈ మ్యాచ్ కు శరత్ కుమార్, రాధిక మరియు తనతో పాటు చాలా మందికి ఆహ్వానాలు అందలేవని... ఇలా నటీనటులకు అన్యాయమే జరుగుతుందని శింబు ఆవేదన వ్యక్తం చేస్తూ... ఈ నడిగర్ సంఘం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. మరి ఈ విషయంపై నాజర్, విశాల్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  Nadigar Sangam  Vishal  

Other Articles