పనిపాట లేదంటున్న ‘సరైనోడు’ | Sarrainodu Dialogue Promo

Sarrainodu dialogue promo

Allu Arjun Sarrainodu Dialogue Promo, Sarrainodu Promos, Sarrainodu trailers, Sarrainodu songs, అల్లు అర్జున్, సరైనోడు, రకుల్ ప్రీత్ సింగ్, Sarrainodu posters, Sarrainodu jukebox, Sarrainodu theater list, Sarrainodu bookings, Sarrainodu shows, Sarrainodu stills, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, ఫోటోలు, Allu Arjun latest stills, Allu Arjun stills, Rakul Preeti Singh latest stills, Rakul Preeti Singh stills

Sarrainodu Dialogue Promo: Stylish star allu arjun latest film Sarrainodu will be release on 22 April. Boyapati Srinu Director, Thaman music, Rakul preet singh heroine.

పనిపాట లేదంటున్న ‘సరైనోడు’

Posted: 04/20/2016 01:02 PM IST
Sarrainodu dialogue promo

అల్లు అర్జున్ కు ఎలాంటి పనిపాట లేదట.. రోజుకు ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా కుమ్మేస్తాడట... ఎంటీ అల్లు అర్జున్ కు పనిపాట లేకపోవడమేంటి? రోజు ఇద్దరిని కుమ్మడమేంటనీ అనుకుంటున్నారా? ఏమో మరి ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సరైనోడు’. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ఈ చిత్రంలోని పలు సీన్లను విడుదల చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమాలో ఓ లవ్లీ కామెడీ సీన్ ను విడుదల చేసారు. ఇందులో రకుల్, అల్లు అర్జున్ ల మధ్య వచ్చే లవ్లీ కామెడీ సీన్ బాగుంది. రకుల్ వాయిస్ బాగుంది. ఇక సినిమా విషయానికొస్తే.... బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ ‘సరైనోడు’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు.

థమన్ సంగీతం అందించిన పాటలు, వీడియోలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ‘సరైనోడు’కు U/A సర్టిఫికెట్ ను అందజేసారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, మలయాళం భాషలలో గ్రాండ్ ఏప్రిల్ 22న విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను కొల్లగొట్టి, ఎంత కలెక్షన్లు రాబట్టనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarrainodu  Allu Arjun  Rakul Preeti Singh  

Other Articles