Sita and Bahubali! Siya Ke Ram’s Madirakshi Mundle meets Prabhas

Madirakshi meets bahubali takes photos

Sita, Bahubali, Madirakshi, Mundle, Prabhas, Sequel, Actress Madirakshi, TV show Siya Ke Ram, vanvaas, bollywood news, prabhas news, prabhas latest news, entertainment news

The adorable Madirakshi Mundle, who stars as Sita in poplular TV show Siya Ke Ram, got a chance to meet Baahubali: The Beginning actor Prabhas during the shoot of the mythological show in Hyderabad.

బాహుబలిని కలసిన బుల్లితెర నటి.. ప్రభాస్ తో ఫోటో..

Posted: 04/12/2016 06:05 PM IST
Madirakshi meets bahubali takes photos

బాహుబలి చిత్రంతో అటు బాలీవుడ్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను.. టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సొంత చేసుకున్నాడని అనడంలో అతిశయోక్తి లేదు, ఆయనను చూస్తే చాలు,, కలిస్తేనే చాలు.. సెల్సీ దిగితే చాలు, ఫోటో దిగితే ఆ తృఫ్తే చాలు అని అనుకునే వాళ్ల సంఖ్య అంతా ఇంతా కాదు, ఈ విషయం మనకు ఈ బుల్లితెర చెబుతోంది, హిందీ సీరియల్ 'సియా కె రామ్'లో సీత పాత్రధారి మదిరక్షికి బాహుబలి హీరో ప్రభాస్ను కలిసే అవకాశం వచ్చింది. 'వనవాస్' టీవీ షో షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన మదిరక్షి.. బాహుబలి పార్ట్ 2 షూటింగ్ సెట్లో ప్రభాస్ను కలిసింది. ఆమె ఈ విషయాన్ని స్వయంగా
చెప్పింది.

సియా కె రామ్ సీరియల్ గురించి, అందులోని తన పాత్ర గురించి బాగా తెలుసని ప్రభాస్ చెప్పాడని, ఈ మాట తనను సర్ప్రైజ్ చేసిందంటూ మదిరక్షి సంతోషం వ్యక్తం చేసింది. ప్రభాస్తో కొద్ది నిమిషాలు మాట్లాడానని, అతడితో కలసి ఫొటో దిగానని, ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పింది. వనవాస్ టీవీ షో నటీనటులు చాలామంది ప్రభాస్ను కలిశారు. ఈ విషయం తనకు తెలియగానే వెళ్లి ప్రభాస్ను కలిసినట్టు మదిరక్షి చెప్పింది. ఎన్నో రికార్డులు సృష్టించిన బాహుబలి బాలీవుడ్లో కూడా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Madirakshi  TV show Siya Ke Ram  Baahubali  Prabhas  

Other Articles