Niharika | Okamanasu | Naga shaurya | Ugadi Posters

Okamanasu ugadi posters

Niharika Okamanasu Ugadi Posters, Niharika dubbing to Okamanasu, Niharika Okamanasu, Okamanasu movie updates, Okamanasu movie details, Niharika stills, Niharika latest updates, Niharika movies, Niharika, Naga shaurya

Okamanasu Ugadi Posters: Konidela Niharika introducing with Okamanasu film. Naga shaurya hero. ramaraju director.

పండగ కానుకగా ‘ఒక మనసు’ రొమాంటిక్ పోస్టర్

Posted: 04/08/2016 12:56 PM IST
Okamanasu ugadi posters

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న తొలి చిత్రం ‘ఒక మనసు’. ఇప్పటికే పలు టీవి షోలలో మంచి పేరును సొంతం చేసుకున్న నిహారిక... ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా ‘కళ్యాణ వైభోగమే’ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న నాగశౌర్య ‘ఒక మనసు’లో నిహారిక సరసన హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులోని తన పాత్రకు నిహారిక సొంతంగా డబ్బింగ్ చేబుతోంది.

ఇదిలా వుంటే తాజాగా ఉగాది పండగ సంధర్భంగా ఈ చిత్ర పోస్టర్లను విడుదల చేసారు. ఈ పోస్టర్లో నిహారికను నాగశౌర్యను ముద్దుపెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. బ్యూటీఫుల్ క్లాసీ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ‘మల్లెలతీరం’ చిత్ర దర్శకుడు రామరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి మరియు టివి9 సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Niharika  Naga shaurya  Oka Manasu  Ugadi Posters  stills  

Other Articles