Tamanna | Prabhudeva | Abhinetri | overseas rights | Stills

Tamannah abhinetri overseas rights sold out

Abhinetri overseas rights sold out, Abhinetri Movie updates, Tamannah Abhinetri movie updates, Abhinetri movie stills, Abhinetri first look, Abhinetri stills, Tamannah stills

Tamannah Abhinetri overseas rights sold out: Milky beauty Tamanna latest tamil film Abhinetri. Vijay Sethupati Hero, Prabhudeva acts in important role.

భారీ రేటుకు అభినేత్రి హక్కులు అమ్మకం

Posted: 04/01/2016 06:27 PM IST
Tamannah abhinetri overseas rights sold out

ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తమన్నా, ప్రభుదేవా, సోనుసూద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అభినేత్రి’. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర తెలుగు వర్షెన్ ను యం.వి.వి సినిమా ప్రొడక్షన్స్ పై యం.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్ర తెలుగు వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని భారీ ఆఫర్‌ ఇచ్చి 9పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సొంతం చేసుకుంది. తెలుగు ఓవర్సీస్‌ రైట్స్‌తో పాటు తమిళ్‌ వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని కూడా పెద్ద మొత్తం ఆఫర్‌ ఇచ్చి 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ దక్కించుకుంది.

‘అభినేత్రి’ చిత్రానికి ప్రముఖ రచయిత కోనవెంకట్ డైలాగ్స్‌ రాయడంతో పాటుగా ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సత్యనారాయణ... బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి నిర్మాతగా తెలుగులో అందిస్తున్నారు‌. ఈ సినిమా విజయంపై గట్టి నమ్మకంతో వున్న కోన వెంకట్‌ 'అభినేత్రి' తెలుగు, తమిళ్‌ ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌లో తాను కూడా షేర్‌ కలిసాడు.

గతంలో ‘లౌక్యం’ చిత్రాన్ని గుంటూరు జిల్లాలో డిస్ట్రిబ్యూట్‌ చేసి పంపిణీదారుడిగా కూడా ఘనవిజయాన్ని సాధించాడే కోన వెంకట్‌. ఇపుడు ‘అభినేత్రి’ ఓవర్సీస్‌ రైట్స్‌లో పార్ట్ నర్‌గా కలవడంతో ‘అభినేత్రి’ సక్సెస్‌పరంగా చాలా పెద్ద రేంజ్‌ హిట్‌ అవుతుందని అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhinetri  Tamanna  Prabhudeva  Dharma Durai  Stills  

Other Articles