Aishwaryaa R Dhanush | Autobiography | Movies | Stills

Aishwaryaa r dhanush autobiography

Aishwaryaa R Dhanush turns writer, Aishwaryaa R Dhanush Autobiography, Aishwaryaa Autobiography, Aishwaryaa R Dhanush latest news, Aishwaryaa R Dhanush movies, Aishwaryaa R Dhanush stills

Aishwaryaa R Dhanush Autobiography: Wife of Kollywood star Dhanush has penned her life story as a celebrity child, star's wife, filmmaker and a mother.

ఆత్మకథ రాస్తున్న యువ దర్శకురాలు

Posted: 03/23/2016 06:49 PM IST
Aishwaryaa r dhanush autobiography

తమిళ దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ తన ఆత్మకథను రాయడానికి నిర్ణయించుకుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, తమిళ స్టార్ హీరో ధనుష్ భార్యగా ఐశ్వర్య తన జీవితాన్ని కొనసాగించకుండా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. దర్శకురాలిగా మారి ఇప్పటికే మూడు చిత్రాలను తెరకెక్కించి, దర్శకురాలిగా మంచి పేరును దక్కించుకుంది.

అయితే ప్రస్తుతం తన ఆత్మకథను రాయడానికి సిద్ధమయ్యింది. తన నిజజీవితంలోని సంఘటనాలు, జ్ఞాపకాలతో కూడిన ఓ పుస్తకాన్ని రచిస్తున్నట్లుగా ఐశ్వర్య తెలిపింది. ‘స్టాండింగ్ ఆన్ యాన్ ఆపిల్ బాక్స్’ అనే టైటిల్ తో తన జీవితకథను త్వరలోనే పుస్తకం రూపంలో విడుదల చేయనున్నట్టు ఐశ్వర్య స్పష్టం చేసింది.

ఈ ఏడాది చివర్లో తన రచన పూర్తి కావచ్చని, సెలబ్రిటీ కూతురుగా, హీరో భార్యగా, తల్లిగా వివిధ భావోద్వేగాల మిశ్రమంగా తన పుస్తకం ఉంటుందని పేర్కొన్నారు. తాను రాస్తుంది తొలిసారి అయినప్పటికీ... తన జీవిత కథ పాఠకులకు మంచి అనుభూతులను మిగులుస్తుందని ఐశ్వర్య ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇందులో కొన్ని ఫిలాసఫికల్ అంశాలు కూడా ఉంటాయని ఐశ్వర్య తెలియజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwaryaa R Dhanush  Autobiography  movies  stills  

Other Articles