Oopiri | Censor report | Nagarjuna | Karthi | Tamannah

Karthi oopiri release on 25 march

Karthi Oopiri Release on 25 March, Oopiri Completes Censor, Oopiri Censor Report, Oopiri Theaters list, Oopiri Trailers, Oopiri songs, Oopiri posters, Oopiri release date, Oopiri stills, Karthi stills, Nagarjuna, Tamannah

Karthi Oopiri Release on 25 March: PVP Cinema’s Oopiri has completed. The censor board has issued a clean U certificate.

దేవుడే ‘ఊపిరి’ని సిద్ధం చేసాడంటున్న నాగ్

Posted: 03/22/2016 10:54 AM IST
Karthi oopiri release on 25 march

అక్కినేని నాగార్జున, కార్తీ, త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన మల్టీస్టార‌ర్ చిత్రం ‘ఊపిరి’. తమిళంలో ‘థోజ’ పేరుతో విడుదల కానుంది. వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం భాషలలో ప్రముఖ నిర్మాత పి.వి.పి నిర్మించారు. ఈనెల 25న ‘ఊపిరి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంధర్భంగా నాగార్జున మాట్లాడుతూ.... ‘ఊపిరి’ ఫ్రెంచ్ ఫిలిం రీమేక్. తెలుగు ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అలాంటి సినిమా ఇది. తొలిసారి తమిళంలో డబ్బింగ్ కూడా చెప్పాను. త‌మిళ‌నాడులో న‌న్ను ఎంత‌గానో రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ట్రూ స్టోరి ఇది. ఇంకా వాళ్లు బ‌తికే ఉన్నారు. కొన్నిసోల్ ఉన్న కథలు ట‌చ్ చేస్తాయి, అటువంటి కథే ‘ఊపిరి’. నేను ఫ్రెంచ్ మూవీ చూసినప్పుడు తెలుగులో ఎవరైనా ఈ సినిమా చేసి ఈరోల్ నాకు ఇస్తే బాగుంటుందనుకున్నాను. నా కోరిక దేవుడు విన్నాడేమో ఈ క‌థ నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చింది. ఈ క‌థలోకి అలాగే కార్తీ వ‌చ్చాడు. హీరోయిన్ గా ఎవ‌ర్నో అనుకుంటే త‌మ‌న్నా వ‌చ్చింది. క‌థే మ‌మ్మ‌ల్ని ఎంచుకుంది.ఈ సినిమా చేయ‌డం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియ‌న్స్. వంశీ త‌న‌ను తాను మార్చుకుని ఈ సినిమా తీసాడు. ఒక నిర్మాత‌గా చెబుతున్నాను ఇలాంటి క‌థ‌తో సినిమా తీయ‌డం అంటే నిర్మాత‌కు క‌ష్టం. పి.వి.పి ఎంతో ఇష్టంతో ఈ సినిమాని నిర్మించారు. కార్తీ ప‌ది సంవ‌త్స‌రాల కెరీర్ లో ప‌ది సినిమాలు చేసాడు అంటే ఎంత సెలెక్టివ్ గా ఉన్నాడో తెలుస్తుంది. అలా సెలెక్టివ్ గా తెలుగులో స్ట్రైయిట్ ఫిల్మ్ చేయ‌డానికి ఈ సినిమాని ఎంచుకున్నాడంటే అర్థం చేసుకోవ‌చ్చు. కార్తీ తెలుగులో డైలాగ్స్ చెప్పే విధానం చూస్తుంటే నేను ఎందుకు త‌మిళ్ డైలాగ్స్ చెప్ప‌లేక‌పోయాన‌ని సిగ్గుప‌డేవాడిని. నిన్న‌నే ‘ఊపిరి’ సినిమా చూసాను. ఒక మంచి సినిమా చేసినందుకు తృప్తిగా..సంతోషంగా ఉంది. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు నా కెరీర్ లో లైఫ్ ఛేంజింగ్ ఫిల్మ్ ‘ఊపిరి’ అన్నారు.

హీరోయిన్ త‌మ‌న్నా మాట్లాడుతూ... నాగ్ సార్ కార్తీ పాత్ర‌ల్లో న‌టించ‌లేదు, జీవించారు. నాగార్జున గారు,కార్తీ లేక‌పోతే ఈ సినిమా లేదు. వీళ్లిద్ద‌రూ లేని ‘ఊపిరి’ సినిమాని అస‌లు ఊహించ‌లేం. వంశీ మ‌న‌సులో ఏం ఉందో అది తెర‌పైకి తీసుకువ‌చ్చారు. ఈ సినిమాలో పార్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాని తెలుగు వారు చూసి గ‌ర్వ‌ప‌డ‌తారు అన్నారు.

హీరో కార్తీ మాట్లాడుతూ..... తెలుగులో నా ఫ‌స్ట్ స్ట్రైయిట్ ఫిలిమ్ ‘ఊపిరి’. ఈ సినిమా అంతా ఒక డ్రీమ్ లా జ‌రిగింది. ఈ సినిమాలో నటించిన వారందరికీ రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా. నాగ్ సార్ ఒక మెచ్యూర్ క్యారెక్ట‌ర్ పోషించారు. ఈ సినిమా జర్నీలో ఆయనతో ఒక రిలేష‌న్ షిప్ ఏర్ప‌డింది. త‌మ‌న్నా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా చాలా బాగా న‌టించింది. ఇది రీమేక్ కాదు. దాదాపు 50 కొత్త సీన్స్ తో తీసిన సినిమా ఇది. ‘ఊపిరి’ బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ.... నిన్న నాగార్జున ‘ఊపిరి’ సినిమా చూసి రాగానే నన్ను హత్తుకుని బాగా చేశావని అభినందించారు. ఈ సినిమా. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. పి.వి.పి గారు మ‌న‌సుపెట్టి ఈ సినిమాని నిర్మించారు. నాకు తెలిసి మాస్ సినిమా క్లాస్ సినిమా అని లేవు. నాకు తెలిసింద‌ల్లా ఒక‌టే మంచి సినిమా చెడ్డ సినిమా. నాగార్జ‌న గారికి ప్లాష్ బ్యాక్ పెట్టాల‌నుకున్నాను. కానీ నాగార్జునగారు అలాంటివేం వద్దన్నారు. ఆయ‌న ఇచ్చిన ఇన్ స్పిరేష‌న్ తోనే ఓ కొత్త సినిమా తీసాను. ‘ఊపిరి’ నా కెరీర్లో మ‌రో మ‌లుపు అవుతుంది. కార్తీ నేను అనుకుని ఈ టైటిల్ పెట్టాం. దిల్ రాజు పి.వి.పి నా సినిమాల‌కు నిర్మాత‌లు కావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా మార్చి 25న విడుదలవుతుంది అన్నారు.

నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ..... ‘ఊపిరి’ సినిమా రెండు సంవ‌త్స‌రాల జ‌ర్నీ. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 25న 2,000 థియేట‌ర్స్ లో ‘ఊపిరి’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. యు.ఎస్ లో 90 మెయిన్ థియేట‌ర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఈచిత్రం తెలుగులో కార్తీకి తొలి స్ట్రయిట్ మూవీ, అలాగే త‌మ‌న్నా ఫ‌స్ట్ టైం తెలుగులో డ‌బ్బింగ్ చెప్పడం, నాగార్జున గారు త‌మిళ్ లో ఫ‌స్ట్ టైం డ‌బ్బింగ్ చెప్పారు. ఇలా ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. హాలీవుడ్ లో తీసిన‌ట్టుగా ఆ స్టాండ‌ర్డ్స్ తో తెలుగులో మ‌నం ఎందుకు సినిమా తీయ‌లేం అనే ప‌ట్టుద‌ల‌తో ఈ సినిమాని తీసాం. ‘ఊపిరి’ స‌క్సెస్ క్రెడిట్ అంటే ఏ ఒక్క‌రికో కాకుండా టీమ్ అంద‌రికీ చెందుతుంది అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oopiri  Censor report  release date  nagarjuna  karthi  tamannah  

Other Articles