Pawan Kalyan | Sardaar Gabbar Singh | Songs | Audio Launch | Teaser

Sardaar gabbarsingh audio songs

Sardaar Gabbarsingh Audio Songs, Sardaar Gabbarsingh Title Song, Sardaar Gabbarsingh Teaser, Pawan Kalyan Sardaar Gabbarsingh Making Video, Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar Singh overseas rights sold out, Sardaar Gabbar Singh Audio Release Date, Sardaar Gabbar Singh Teaser Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbarsingh Audio Songs: Power star pawan kalyan Sardaar Gabbar singh Audio Jukebox. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో రివ్యూ

Posted: 03/20/2016 08:15 PM IST
Sardaar gabbarsingh audio songs

‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి వరుస బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ చిత్రాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే... ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొంటాయో అందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా, రికార్డులు క్రియేట్ చేసాయి. అలాంటి హ్యట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’.

ఆడియో విడుదలకు ముందే ఈ చిత్ర పాటలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆ పాటలు వివరాలు.. వాటి రివ్యూ మీకోసం అందిస్తున్నాం.

1. సర్దార్ గబ్బర్ సింగ్
ఈ పాట సినిమా టైటిల్ సాంగ్. గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పాట తరహాలో కాకుండా చాలా వెస్ట్రన్ బీట్ తో రూపొందింది. ఇందులో కాస్త మాస్ మసాలా తగ్గడంతో... ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టైటిల్ ట్రాక్ వెస్ట్రన్ బీట్ ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చేస్తుంది.

2. తోబ తోబ...
ఈ పాట చాలా మాసివ్ గా వుంది. మాస్ ప్రేక్షకులకు బాగా కిక్కించే తరహాలో ఈ పాట సాగుతోంది. ఈ పాట వింటూంటే అమితాబ్ బచ్చన్ ఓల్డ్ హిట్ సాంగ్ బీట్ మ్యూజిక్ విన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఈ పాటను దేవి చాలా కొత్తగా కంపోజ్ చేసాడు. అలాగే వెంటనే కనెక్ట్ అయ్యే విధంగా, తేలికైన పదాలతో ఈ పాటను రూపొందించారు.

3. చూడకు చూడకు...
ఈ పాట హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్ లా సాగుతోంది. చాలా చక్కని సాహిత్యంతో రూపొందింది. వినడానికి వినసొంపుగా వుంది. హీరో, హీరోయిన్లు ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకునే విధంగా ఈ పాటను రూపొందించారు. సాఫ్ట్ మెలోడి పాటలను ఇష్టపడేవారు వెంటనే కనెక్ట్ అయిపోతారు.

4. సిన్నదాని సూపులోనా...
ఈ పాట చాలా మాసివ్ కెమిస్ట్రీ సాంగ్ లా కొనసాగుతుంది. మంచి డాన్సింగ్ నెంబర్ లా వుంటుంది. పాట మ్యూజిక్ ఈ పాటకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ‘గబ్బర్ సింగ్’లోని పిల్లానువ్వులేని జీవితం పాట తరహాలోని బిజీయం మ్యూజిక్ వలే ఈపాట కూడా భారీగా పాపులర్ అవ్వడం ఖాయం. ఇక పాటలో సాహిత్యం కూడా చాలా సింపుల్ గా వుంది.

5. ఓ పిల్లా సుభనాల్లా...
‘చూడకు చూడకు...’ పాట తర్వాత ఈ సినిమాలో వున్న మరో పాట ఇది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ ట్రాక్ ఇది. వెస్ట్రన్ బీట్ విత్ క్లాస్ బీజియంతో కొత్తగా ఈ పాటను రూపొందించారు. ఈ పాటలో పవన్, కాజల్ ల మధ్య కెమిస్ట్రీ హిట్టయ్యితే సాంగ్ మరింత బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయం.

6. సర్దార్ అన్న
ఇక ఈ పాట సినిమాలో పూర్తిస్థాయి మాస్ బీట్ సాంగ్. ఒకరకంగా చెప్పాలంగే బిట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ‘సర్దార్’ అన్నకు అడ్డు ఎవడు... అనే లైన్ తో రూపొందింది. పవన్ కళ్యాణ్ హీరోయిజంను చూపించిన క్షణంలో వచ్చే సాంగ్ లా కనిపిస్తోంది. పవర్ స్టార్ అభిమానులకు ఈ పాటకు బాగా కనెక్ట్ అవుతారు.

బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాయ్ లక్ష్మీ, సంజనలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles