Tiger Shroff underwent Kalaripayattu training for ‘Baaghi’

Tiger shroff kalaripayattu training for baaghi

Baaghi,Nadiadwala Grandson,Nimrat Kaur,Sabbir Khan,Tiger Shroff, actress Shraddha Kapoor, Kalaripayattu, kerala martial arts, kalari martial arts

"I underwent extensive training in Kalaripayattu before we started shoot as the martial art form is an important part of the film. It was a thoroughly enriching experience," Tiger said in statement.

కేరళ యుద్దవిద్యను సాధన చేస్తున్న టైగర్ ష్రాఫ్

Posted: 03/13/2016 07:17 PM IST
Tiger shroff kalaripayattu training for baaghi

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణించాలన్న తపన వుంటే సరిపోదు.. అందుకోసం కఠోర శిక్షణ కూడా అవసరం. అంటే నటనాభినయంలోనే కాదు అన్ని రంగాలలో అందె వేసిన చేయిగా వుండాల్సిందే. అందుకోసం తమ వచ్చే సినమా అఫర్ల మేరకు నటీనటులు ఆయా రంగాలలో శిక్షణ కూడా పోందటం మనం చూస్తూనేవున్నాం. అయితే ఇది హీరోయిన్లకు మాత్రమే పరిమితం కాదు. హీరోలకు కూడా అవసరంగా మారిందనే చెప్పాలి. జాకీష్రాఫ్ తనయుడిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. తొలి సినిమాతోనే ఆ ముద్రను చెరిపేశాడు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్.

షబ్బీర్ దర్శకత్వంలో వచ్చిన ‘హీరోపంటి’  మూవీలో మైనస్ 9 డిగ్రీల చలిని కూడా లెక్కచేయకుండా హీరోయిన్ కృతి సనన్ తో రొమాన్స్ చేసి ఔరా అనిపించాడు. తాజాగా తన రెండో చిత్రం 'బాఘీ' కోసం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు టైగర్. సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీని సిద్ధంచేశాడు. ప్రస్తుతం కొన్ని యాక్షన్ సీన్లలో అవసరాల నిమిత్తం కేరళ యుద్ధవిద్య 'కలరీపట్టు' నేర్చుకుంటున్నాడు.

అద్భుతంగా డ్యాన్స్ చేయడమే కాదు.. అవసరమైతే మూవీ కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొనేందుకు టైగర్ వెనుకాడటం లేదని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. మూవీలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఉన్నాయని, వాటిలో భాగంగా తాను కేరళ యుద్ధవిద్యను నేర్చుకోవడానికి వెళ్తున్నానని టైగర్ కూడా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ట్రైనర్ల సహాయంతో 'కలరీపట్టు' కాస్త నేర్చుకున్నాక షూటింగ్ మళ్లీ మొదలెడతామని టైగర్ చెప్పుకొచ్చాడు. షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో టైగర్ తో ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ జతకట్టిన విషయం తెలిసిందే. రేపు 'బాఘీ' మూవీ ట్రైలర్ విడుదల కానుంది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baaghi  Nadiadwala Grandson  Nimrat Kaur  Sabbir Khan  Tiger Shroff  

Other Articles