Netizens fire on nandamuri Balakrishna for his contraversial statements

Netizens fire on nandamuri balakrishna for his contraversial statements

balakrishna, Nandamuri balakrishna, Balayya, Savithri Audio, Balakrishna Contraversial Statements

balakrishna spoke some contraversial statements about girls. Netizens fires on those statements.

బాలయ్య మీద మండిపడుతున్న నెటిజన్లు

Posted: 03/07/2016 02:19 PM IST
Netizens fire on nandamuri balakrishna for his contraversial statements

నటుడిగానే కాకుండా హిందూపురం ప్రజాప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నందమూరి బాలకృష్ణపై మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సావిత్రి ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య ఒకానొక సందర్భంలో అమ్మాయికి ముద్దైనా పెట్టాలి ,లేదా కడుపైనా చేయాలి అంతేకాని వాళ్ళ వెంట పడే పాత్రలు నేను చేయలేను అంటూ సంచలన కామెంట్ చేసారు . దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాధ్యత గల ఎమ్మెల్యేలగా ఉండి బాలకృష్ణ ఇలాంటి విమర్శలు చెయ్యడం ఏంటని చాలా మంది మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్టీఆర్ పరువు తీస్తున్నారని కొంత మంది అభిమానులు అంటుంటే.. మరికొందరు నందమూరి పేరు ఎలా చెప్పుకుంటారు అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి బాలయ్య చేసిన హాట్ కామెంట్లు ఓ వర్గం నుండి వ్యతిరేకతను మూటకట్టుకుంటున్న మాట మాత్రం వాస్తవం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles