Dhanush | Mass | Maari | Kajal | Release date

Dhanush maari as mass

Dhanush as Mass, Maari as Mass, Dhanush Mass release date, Dhanush Mass stills, Dhanush Mass movie updates, Dhanush stills, Dhanush movies, Dhanush

Dhanush Maari as Mass: Tamil star hero dhanush latest film maari. this film will be release on 18 march in telugu with Mass title. kajal heroine.

‘మాస్’గా వస్తున్న ధనుష్ ‘మారి’

Posted: 03/04/2016 10:01 AM IST
Dhanush maari as mass

తమిళ స్టార్ హీరో ధనుష్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మారి’. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో "మాస్" పేరుతో అనువాదమవుతోంది. "వి. ఎం. అర్" సమర్పణలో జయప్రద పిక్చర్స్ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. "లవ్ ఫెయిల్యూర్" ఫేం బాలాజీ మోహన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి "వై దిస్ కొలవేరి ఫేం" అనిరుధ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడుతూ... ధనుష్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామర్, అనిరుధ్ మ్యూజిక్, సాహితి అందించిన మాటలు-పాటలు బాలాజీ మోహన్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం "మాస్" చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ నూ అమితంగా అలరించే చిత్రమిది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది అన్నారు.

విజయ్ ఏసుదాస్, రోబో శంకర్ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రసన్న జి.కె, సినిమాటోగ్రఫి: ఓంప్రకాష్, మాటలు-పాటలు: సాహితి, సంగీతం: అనిరుధ్, సమర్పణ: "వి.ఎం.ఆర్", నిర్మాత: వాసిరెడ్డి పద్మాకరరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: బాలాజీ మోహన్ !!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Kajal  Mass  Maari  stills  

Other Articles