Allu Arjun | Sarainodu | Teaser | Bolivia | Rakul preet singh

Sarrainodu film shooting in bolivia

Sarrainodu Shooting in Bolivia, Sarainodu Teaser, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Sarrainodu Film Shooting in Bolivia: Stylish star allu arjun latest film Sarainodu. boyapati srinu director, Rakul preet singh heroine. Thaman Music.

బొలివియాలో ‘సరైనోడు’తో రకూల్ రొమాన్స్

Posted: 03/01/2016 01:26 PM IST
Sarrainodu film shooting in bolivia

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సరైనోడు’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇందులో బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

‘సరైనోడు’ టీం ప్రముఖ దర్శకుడు శంకర్ ‘రోబో2’ లొకేషన్స్ ను ఎంపిక చేసుకున్నారు. అదేంటంటే... ‘రోబో2’ కోసం శంకర్ ‘బొలీవియా’లోని అందమైన ప్రదేశాలలో కొన్ని సీన్లు, సాంగ్స్ ను చిత్రీకరించాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ‘రోబో2’ షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఆ అవకాశం ‘సరైనోడు’ యూనిట్ కు దక్కింది.

బొలివియాలో ‘సరైనోడు’ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్ ను చిత్రీకరించబోతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రయాణం కానున్నారు. ఈ పాటను బొలివియాలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించడానికి ‘సరైనోడు’ టీం ప్లాన్ చేసింది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేసి, వేసవి సెలవుల కానుకగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarainodu  Shooting updates  Teaser  Rakul preet singh  

Other Articles