Saif Ali Khan | clarifies | KI and KA, Arjun Kapoor | Kareena Kapoor

Kareena kapoor responds on arjun kapoor issue

Kareena Kapoor Clarifies on Arjun kapoor issue, Saif Ali Khan angry on Arjun kapoor, JI HUZOORI Video Song in KI and KA, KI and KA movie songs, KI and KA trailers, KI and KA videos, Arjun Kapoor movies, Arjun Kapoor stills, Kareena Kapoor latest news, Kareena Kapoor movies, Kareena Kapoor stills

Kareena Kapoor Responds on Arjun kapoor issue: Arjun Kapoor & Kareena Kapoor starring, R. Balki directed upcoming movie KI & KA whose story revolves around a young, married couple whose relationship challenges the gender roles placed upon women and men in Indian society. The song is Mithoon (ft. Deepali) in the lyrics of Sayeed Quadri & music composed, arranged and programmed by Mithoon himself.

ముద్దుల విషయంలో కరీనా మొగుడు అలా అన్నాడట

Posted: 02/29/2016 05:46 PM IST
Kareena kapoor responds on arjun kapoor issue

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ వల్ల బాలీవుడ్ లవ్లీ జంట సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయని, వీరిద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఆర్. బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా, అర్జున్ లు భార్యభర్తలుగా నటిస్తున్నారు. హౌస్ హస్బెండ్ పాత్రలో అర్జున్... ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం చేసే భార్య పాత్రలో కరీనా కపూర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంది.

అయితే ఇటీవలే ఓరోజు అర్థరాత్రి కరీనాకు అర్జున్ కపూర్ ఫోన్ చేసాడట. కానీ ఆ కాల్ ను సైఫ్ రిసీవ్ చేసుకొని, అర్జున్ గట్టిగా క్లాస్ పీకాడటని సమాచారం. దీంతో అర్జున్ పై ఎందుకలా సీరియస్ అయ్యావంటూ కరీనా-సైఫ్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయని, వీరిద్దరూ ఈ విషయంపై కాస్త సీరియస్ గా వున్నారంటూ బాలీవుడ్ లో వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలపై కరీనా కపూర్ క్లారిటీ ఇచ్చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై కరీనా మాట్లాడుతూ... ‘నేను, అర్జున్ కపూర్ భార్యభర్తలుగా ‘కీ అండ్ కా’ సినిమాలో నటిస్తున్నామని, ముద్దు సీన్లు కూడా చేయాల్సి వుంటుందని సైఫ్ తో చెప్పాను’ అని కరీనా తెలిపారు. ‘సినిమాలో భార్య భర్తల పాత్రలు ఉన్నపుడు ఇలాంటి సీన్లు చేయడం సాధారణమే. ఈ విషయంలో నేను స్టుపిడ్ గా ప్రవర్తించను, అనవసర ఆంక్షలు పెట్టేరకం కాదు నేను. మనం ఏదైనా పాత్ర చేసేపుడు పర్ ఫెక్ట్ సీన్ పండటానికి ఇలాంటి ఎన్నో చేయాల్సి ఉంటుంది’ అని సైఫ్ చెప్పినట్లుగా కరీనా వెల్లడించారు.

కరీనా స్టేట్ మెంట్ తో మొన్నటివరకు వినిపించిన పుకార్లకు స్వస్తి పలికినట్లుగా అయ్యింది. ఇక ఈ ‘కీ అండ్ కా’ సినిమా విషయానికొస్తే... ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saif Ali Khan  clarifies  Arjun kapoor  Kareena Kapoor  KI and KA  stills  

Other Articles