Meghana Raj | cheating case | cleared | Marriage | Stills

Meghana raj marriage cheating case cleared

Meghana Raj cheating case cleared, Meghana Raj cheating case, Meghana Raj marriage issue, Meghana Raj latest news, Meghana Raj movies, Meghana Raj hot stills, Meghana Raj stills

Meghana Raj marriage cheating case cleared: South Indian actress Meghana Raj, who has acted in Malayalam, Kannada and Tamil movies, has been accused of cheating a businessman.

హీరోయిన్ పెళ్లి కథ ముగిసింది

Posted: 02/26/2016 09:41 AM IST
Meghana raj marriage cheating case cleared

తెలుగులో అల్లరి నరేష్ సరసన ‘బెండు అప్పారావు’ చిత్రంలో నటించిన నటి మేఘనా రాజ్ పై వచ్చిన ఛీటింగ్ కేసు ఎట్టకేలకు క్లియర్ అయ్యింది. మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించిందంటూ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త జనార్దన్ కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

అయితే తమకు పెళ్లి అయ్యినట్లుగా జనార్ధన్ ఎలాంటి సాక్ష్యాలు చూపించకపోవడంతో కేసును మూసేసినట్లుగా బెంగుళూర్ దక్షిణ విభాగం డిసీపి లోకేష్ కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియాకు వెల్లడించారు. జనార్ధన్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచి వివరాలను సేకరించారు. మేఘనరాజ్ తో వివాహం అయినట్లుగా అతను ఎలాంటి సాక్ష్యాలను చూపలేకపోయాడు. అలాగే మేఘనరాజ్ ఎక్కడ వుండేదీ అనే పలు ప్రశ్నలకు సైతం సమాధానాలు చెప్పకపోవడంతో ఫిర్యాదు దశలోనే ఈ కేసును మూసేశారు.

అయితే ఈ విషయంపై మేఘన రాజ్ తల్లి ప్రమీలా జోషాయ్ మాత్రం గరం గరం అవుతున్నారు. అసలు జనార్థన్ అనే వ్యక్తి ఎవరో కూడా తమకు తెలియదని, తన కూతురు ఎదుగుదలని చూసి తట్టుకోలేని కొందరు ఇలాంటి దుష్ప్రచారానిక పాల్పడుతున్నారని అన్నారు. జనార్ధన్ పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని ఆమె చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meghana Raj  Cheating case  marriage issue  stills  

Other Articles