Nani | Dhamaka | second schedule | kodaikanal | Surabhi

Nani dhamaka in kodaikanal

Nani Dhamaka movie second schedule in kodaikanal, Nani Dhamaka movie updates, Nani movies, Nani movie news, Nani movie details, Nani stills, Nani

Nani Dhamaka in kodaikanal: Nani upcoming film under director indraganti mohanakrishna. this film second schedule in kodaikanal.

కొడైకెనాల్ లో రొమాన్స్ చేయబోతున్న నాని

Posted: 02/20/2016 01:48 PM IST
Nani dhamaka in kodaikanal

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న హీరో నానికి ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రం హ్యట్రిక్ విజయాన్ని అందించింది. ఇటీవలే విడుదలైన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రం అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో కొనసాగుతోంది. ప్రస్తుతం నాని ప్రేమగాథ సక్సెస్ టూర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తర్వాత నాని నటిస్తున్న మరో చిత్రం ‘ధమాక’ (వర్కింగ్ టైటిల్). ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇప్పటికే హైదరాబాద్ లో పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ప్రమోషన్స్ కార్యక్రమంలో నాని బిజీగా వుండటం వల్ల ‘ధమాక’ చిత్ర షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు.

అయితే ఇపుడు అన్ని పనులు పూర్తి చేసుకొని, ‘ధమాక’ సెకండ్ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు నాని. ఈవారం చివరి నుంచి కొడైకెనాల్ లో చిత్రీకరించనున్నారు. ఇందులో నాని సరసన నివేదిత థామస్, సురభి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Dhamaka  indraganti mohanakrishna  stills  

Other Articles