Allu Arjun Sarrainodu Teaser cinema teaser out

Allu arjun sarrainodu teaser cinema teaser out

Allu Arjun, Sarrainodu Teaser, Sarrainodu Stills, Allu Arjun News

Allu Arjun new cinema Sarrainodu Teaser creating hipe. Sarrainodu Teaser unit released the teaser today.

హైవోల్టేజ్ సరైనోడు మాస్.. ఊరమాస్ టీజర్

Posted: 02/18/2016 05:00 PM IST
Allu arjun sarrainodu teaser cinema teaser out

ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడనుకుంటున్నావేమో మాస్... ఊరమాస్ అంటూ అల్లు అర్జున్ సరైనోడు టీజర్ తో అదరగొట్టాడు. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో సరైనోడు చిత్రం తెరకెక్కుతుండగా, ఈ చిత్ర టీజర్‌ని తాజాగా విడుదల చేసారు. బన్నీ ఈ చిత్రంతో సరికొత్త ట్రెండ్‌ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. థీయేట్రికల్ టీజర్‌లా సరైనోడు టీజర్‌ని నెట్‌తో పాటు దాదాపు 1000 థీయేటర్లలలో ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ లుక్ మెస్మరైజ్ చేసేలా ఉండగా, అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.

అల్లు అర్జున్ ఎనర్జీని స్క్రీన్ నిండా చూపించిన బోయపాటి శీను సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేశాడు. హీరోయిజాన్ని బాగా చూపించే బోయపాటి శీను టీజర్ తోనే అదరగొడితే ఇక సినిమాలో ఏరేంజ్ లో అదరగొడతారో అని సినీ జనాలు అప్పుడే చర్చించుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ రఫ్ లుక్ లో మరింత హాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarrainodu Teaser  Sarrainodu Stills  Allu Arjun News  

Other Articles