Dil Raju | Raviteja | Yevado Okadu | Krishnashtami | Stills

Dil raju responds on yevado okadu issue

Dil Raju Clarifies on Yevado Okadu, Dil Raju talks about Yevado Okadu, Dil Raju Responds on Yevado Okadu, Dil Raju interview, Dil Raju stills, Krishnashtami release date, Krishnashtami movie trailers, Krishnashtami movie songs, Krishnashtami movie posters, Krishnashtami movie stills

Dil Raju Responds on Yevado Okadu issue: Sunil upcoming film Krishnashtami will be release on 19 Feb. Nikky galrani, Dimple chopadia heroines. Producer Dil Rajudinesh music. vasu varma direction.

ఇపుడు ‘ఎవడో ఒకడు’ రవితేజ కాదట

Posted: 02/17/2016 06:09 PM IST
Dil raju responds on yevado okadu issue

‘భద్ర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో ‘ఎవడో ఒకడు’ చిత్రం రూపొందనుందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. రవితేజ, దిల్ రాజుల మధ్య మనస్పర్తలు వచ్చి ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని గతకొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఈ విషయంపై దిల్ రాజు ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన ‘కృష్ణాష్టమి’ చిత్రం ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సంధర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు ‘ఎవడో ఒకడు’ ప్రాజెక్టు విషయంలో వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చేసారు. దిల్ రాజు మాట్లాడుతూ.... ను, రవితేజ మంచి ఫ్రెండ్స్‌. సినిమా అంటే మేమిద్దరమే కాదు. అందరినీ హ్యండిల్‌ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చిన్న చిన్నవాటి వల్ల సినిమా ఆగిపోయింది అని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు అదే కథను నాగార్జునగారితో చేయాల‌నుకుంటున్నాను. ఆయన్ను అప్రోచ్‌ అయ్యాను. ఆయన కథ వినాల్సి ఉంది అని దిల్ రాజు స్పష్టం చేసారు. మరి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని అర్థమవుతోంది. మరి ‘ఎవడో ఒకడు’ ప్రాజెక్టులో నటించబోయే హీరో ఎవరో భవిష్యత్తులోనే తెలియనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Raviteja  Yevado Okadu  Krishnashtami  stills  

Other Articles