Sonam kapoor | Arjun kapoor | Movies | Love | Stills

Sonam kapoor angry on arjun kapoor

Sonam kapoor talks about Arjun kapoor, Sonam kapoor unhappy with Arjun kapoor, Sonam kapoor angry Arjun kapoor, Sonam kapoor with Arjun kapoor, Sonam kapoor latest stills, Sonam kapoor stills, Sonam kapoor hot stills

Sonam kapoor angry on Arjun kapoor: Bollywood star heroine unhappy with her cousin brother, bollywood hero arjun kapoor.

చెల్లికి విలన్ గా మారిన అన్నయ్య

Posted: 02/17/2016 09:11 AM IST
Sonam kapoor angry on arjun kapoor

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కు తన అన్నయ్యలను చూస్తే భయమేస్తుందట. ఎందుకంటే తన స్నేహితులు కూడా అన్నల్లాగే మారిపోతున్నారని సోనమ్ బాధపడుతోంది. ప్రస్తుతం వున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సోనమ్ కపూర్ ఒకరు. ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

దీంతో పార్టీలు, ఫంక్షన్లలో పాల్గొనడం సాధారణమే. కానీ తన అన్నలు ఎప్పుడూ తనను సంరక్షించాలని చూడటం, తనను నీడలా వెంటాడటం అప్పుడప్పుడు ఇబ్బందిగానే అనిపిస్తోందని చెబుతోంది సోనమ్. బాలీవుడ్ హీరో అనిల్ కపూర్, సునితాకపూర్‌ల కూతురైన సోనమ్‌కు సొంత అన్న హర్షవర్ధన్ కపూర్‌తో పాటు, పెదనాన్న కొడుకులు అర్జున్ కపూర్, మోహిత్ కూడా ఉన్నారు.

వీరందరితో కలిసి పార్టీ చేసుకోవడం చాలా కష్టమని.. ఈ అన్నయ్యలు ఎప్పుడూ కూడా తనను కాపాడాలని చూస్తుండటం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని సోనమ్ ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. అందువల్ల తన మగ స్నేహితులు కూడా అన్నల్లాగే మారిపోతున్నారని.. వేరే కొత్త మగవాళ్లని ఈ అన్నయ్యలు పరిచయం చేయడం లేదని, ఏ అబ్బాయితోనూ క్లోజ్ గా తిరగనివ్వడం లేదని సోనమ్ చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ గురించి చెబుతూ... అర్జున్ కపూర్ హీరోగా చాలా కూల్ గా కనిపించినా.. అన్నయ్యగా మాత్రం అస్సలు కూల్ కానే కాదని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఆ అబ్బాయిని తనకు పరిచయం చేయాలని చెబుతుంటాడని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పుకొచ్చింది. పాపం సోనమ్ భామకు బాయ్ ఫ్రెండ్స్ దొరకాలంటే అన్నయ్యలకు ఎవరైనా భామలు దొరికితే బాగుండునని సోనమ్ భావిస్తుంది కావచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonam kapoor  Arjun Kapoor  Movies  Love Affair  Stills  

Other Articles