Krishnagaadi Veera Premagaadha | thanks meet | Nani | Mehr Pirzada

Krishnagaadi veera premagaadha movie thanks meet

Krishnagaadi Veera Premagaadha thanks meet, Krishnagaadi Veera Premagaadha collections, Krishnagaadi Veera Premagaadha talk, Krishnagaadi Veera Premagaadha tickets, Krishnagaadi Veera Premagaadha stills, Krishnagaadi Veera Premagaadha songs, Krishnagaadi Veera Premagaadha movie, Krishnagaadi Veera Premagaadha, Nani, Mehr Pirzada stills

Krishnagaadi Veera Premagaadha movie thanks meet: Nani latest block buster hit Krishnagaadi Veera Premagaadha. This film team attend in thanks meet.

కృష్ణగాడి సక్సెస్ టూర్ కు సన్నాహాలు

Posted: 02/15/2016 10:30 AM IST
Krishnagaadi veera premagaadha movie thanks meet

నాని, మెహ‌రీన్ జంట‌గా కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ సినిమా ఇటీవ‌ల విడుద‌లైంది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా థాంక్స్ మీట్ హైద‌రాబాద్‌లో ఆదివారం జ‌రిగింది.

నాని మాట్లాడుతూ ``సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని, ప్రేక్ష‌కులు త‌మ భుజాల మీద సినిమాను న‌డిపిస్తున్నార‌ని ఓ డిస్ట్ర‌బ్యూట‌ర్ చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది. ఈసినిమాలోని ప్ర‌తి పాత్ర క‌థ‌ను న‌డిపించింది. నాకు, ముర‌ళీవ‌ర్మగారికి, పృథ్వి గారికి కాంబినేష‌న్ సీన్లు అస‌లు లేవు. కానీ ఒక‌రి వ‌ల‌న మ‌రొక‌రి జీవితాలు మారిపోతాయి. శ‌త్రుకి ఈ సినిమాతో పెద్ద బ్రేక్ వ‌చ్చింది. భ‌విష్య‌త్తులో త‌ను చాలా పెద్ద న‌టుడ‌వుతాడు. మ‌హాల‌క్ష్మికి అన్న పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. పృథ్వి గారి ఆర్కెస్ట్రా అదిరింది. మెహ‌రీన్ చాలా చ‌క్క‌గా న‌టించింది. స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం`` అని చెప్పారు.

హ‌ను రాఘ‌వ‌పూడి మాట్లాడుతూ ``ఈరోజు నేనున్నంత ఆనందంగా ఇంకెవ‌రూ ఉండ‌రేమో. కృష్ణగాడి వీర ప్రేమ గాథ అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కంతో సినిమాను మొద‌లుపెట్టాను. నా న‌మ్మ‌కం నిజ‌మైంది. ఈ సినిమా క‌లెక్ష‌న్స్ రోజురోజుకీ పెరుగుతాయే కానీ త‌గ్గ‌వ‌ని నాని చెప్పాడు. అలానే జ‌రుగుతోంది. నాకు నిర్మాత‌లు చాలా బాగా స‌హ‌క‌రించారు. వాళ్ళు ఎక్క‌డా కాంప్రమైజ్ కాలేదు. యువ‌రాజ్ కెమెరాప‌నిత‌నం చాలా బావుంది. లైవ్ లొకేష‌న్స్ లో షూట్ చేశాం. ఈ సినిమాకు నాని అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఈ సినిమా స‌క్సెస్‌తో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం న‌వ్వుకు ఉన్న విలువ తెలిసింది`` అని అన్నారు.

గోపీ ఆచంట మాట్లాడుతూ `` సినిమాను పెద్ద స‌క్సెస్ చేసిన వారికి ధన్య‌వాదాలు. నైజాం వెళ్ళి అక్క‌డి నుంచి వైజాగ్‌కు మా టీమ్ స‌క్సెస్ టూర్ చేప‌ట్ట‌నుంది. ఓవ‌ర్సీస్‌లోనూ మా సినిమాకు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది`` అని అన్నారు.

మెహ‌రీన్ మాట్లాడుతూ ``అంద‌రికీ నా వ‌ర్క్ న‌చ్చింది. నా మీద న‌మ్మ‌కంతో మ‌హాల‌క్ష్మి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఇచ్చిన హ‌ను గారికి థాంక్స్. నా మొద‌టి సినిమాలో సీనియ‌ర్ న‌టుల‌తో న‌టించ‌డం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

శ‌త్రు, రామ‌రాజు, రాజేష్‌, పృథ్వి, అనిల్ సుంక‌ర‌, యువ‌రాజ్ త‌దిత‌రులు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishnagaadi Veera Premagaadha  thanks meet  Nani  Mehr Pirzada  stills  

Other Articles