Puri Jagannadh | NTR | Kalyan Ram | Movie News | Stills

Puri jagannadh next movie with ntr

Puri Jagannadh movie with ntr and kalyan ram, Puri Jagannadh next film with ntr, Puri Jagannadh NTR film updates, Puri Jagannadh NTR movie news, NTR movies, Jr Ntr movie updates, Puri Jagannadh movies, NTR, Kalyan Ram

Puri Jagannadh next movie with ntr: tollywood dashing director Puri Jagannadh confirmed his next movies with young tiger ntr and nandamuri kalyan ram.

మరోసారి రిపీట్ కానున్న ‘టెంపర్’ కాంబినేషన్

Posted: 02/05/2016 09:53 AM IST
Puri jagannadh next movie with ntr

‘ఆంధ్రావాలా’ వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్- పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘టెంపర్’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఎన్టీఆర్ లుక్స్ పరంగా చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఇంకా సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్, యాక్షన్ ఎపిసోడ్లలో అదరగొట్టేసాడు. మొత్తానికి ‘టెంపర్’ సినిమా దుమ్ముధులిపేసింది.

ఇదిలా వుంటే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. తాజాగా ఎన్టీఆర్ కు పూరీ ఓ కథ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట ఎన్టీఆర్. అదే రోజున నందమూరి కళ్యాణ్ రామ్ కు ఓ కథ వినిపించి, ఓకే చేయించుకున్నాడు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలకు వేరు వేరు కథలు చెప్పి ఓకే చేయించుకోవడం పూరీ వల్లనే సాధ్యమవుతోందని చెప్పుకోవచ్చు. ఇక మిగిలింది బాలయ్య బాబు ఒక్కడే. బాలయ్య కోసం కూడా పూరీ ఓ కథను సిద్ధం చేస్తే ఇప్పుడున్న నందమూరి హీరోలందరితో పూరీ పనిచేసిన రికార్డు వుండిపోతుంది.

ఇదిలా వుంటే పూరీ-కళ్యాణ్ రామ్ ల కాంబినేషన్లో రూపొందనున్న ప్రాజెక్ట్ ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నాడు. ఇక పూరీ-ఎన్టీఆర్ ల కాంబినేషన్లో రూపొందనున్న ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  NTR  Kalyan Ram  Movie News  Stills  

Other Articles