Sardar Gabbar Singh Pre Release Business

Sardar gabbar singh pre release business

sardar gabbar singh, pawan kalyan, sardar pre release business, director bobby, kajal agarwal, sharat marar

Sardar Gabbar Singh Pre Release Business

ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సర్దార్ రికార్డ్

Posted: 01/31/2016 02:58 PM IST
Sardar gabbar singh pre release business

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన రూ.5 కోట్ల ‘రతన్‌పూర్’ భారీ సెట్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. గతంలో ఘనవిజయం సాధించిన ‘గబ్బర్‌సింగ్’ పాత్రనే పవన్ మళ్ళీ రిపీట్ చేస్తున్న కారణంగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే.. ఈ మూవీ రైట్స్ ఊహించని రేంజులో అమ్ముడుపోతున్నాయి.

ఇప్పటికే ఈ మూవీ వరల్డ్‌వైడ్ రైట్స్‌ని ‘ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ’వారు రికార్డ్ స్థాయిలో రూ.72 కోట్లు సమర్పించి కొనుగోలు చేసింది. ఇక టాలీవుడ్‌లో ఈ మూవీకి వున్న క్రేజ్‌ని బట్టి ఆ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో భారీ రేటుకు అమ్మినట్లు సమాచారం. అందులో భాగంగానే.. ‘సర్దార్’ సీడెడ్ రైట్స్ రూ.10.7 కోట్లకి అమ్ముడుపోగా.. తాజాగా అందిన మరో రిపోర్ట్ ప్రకారం వైజాగ్ రైట్స్‌ రూ.7.2 కోట్లకి అమ్ముడుపోయినట్లు తెలిసింది. వైజాగ్‌లో ఓ మూవీ రైట్స్ ఇంత భారీ రేంజులో అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వల్ల ఈ అమౌంట్‌ని క్రాస్ చేసేలా కలెక్షన్స్ ఉంటాయనే నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్స్ ఈ రేటుకు కొన్నట్లు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ రైట్స్ కూడా రూ.10 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

రిలీజ్‌కి ముందే ఈ మూవీ రికార్డ్ స్థాయిలో చేస్తున్న బిజినెస్‌ని చూస్తుంటే.. విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కాగా.. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకూ కేరళలో షూటింగ్ చేయనున్నారు. ఇందులో పవన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles