Priyanka Chopra | bold Comments | Marriage | Stills

Priyanka chopra bold comments on her marriage

Priyanka Chopra Hot Comments on her Marriage, Priyanka Chopra bold Comments, Priyanka Chopra Comments on Marriage, Priyanka Chopra interview marriage, Priyanka Chopra marriage comments, Priyanka Chopra latest news, Priyanka Chopra stills, Priyanka Chopra

Priyanka Chopra bold Comments on her Marriage: Bollywood Actress Priyanka Chopra bold Comments on her Marriage. Priyanka Chopra movies, stills, gallery.

పిల్లల కోసమే మగాడు కావాలంటున్న భామ

Posted: 01/30/2016 11:06 AM IST
Priyanka chopra bold comments on her marriage

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం పెళ్లి చేసుకున్నా కూడా తాను ఇలాగే వుంటానని చెబుతోంది. తాను పెళ్లి చేసుకునేది కేవలం పిల్లల కోసమేనని, వచ్చే వాడిపై ఆధారపడి బ్రతకడానికి కాదంటూ తేల్చిచెప్పేసింది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... స్వశక్తితో పైకొచ్చిన నేను డబ్బు కోసమో, ఖరీదైన బహుమతుల కోసమో బాయ్‌ఫ్రెండ్స్‌ని మెయిన్‌టైన్ చేయాలనుకోను. ఇల్లు, కారు, ఖరీదైన వజ్రాలు కొనుక్కునే సత్తా నాకుంది. కానీ వాటి కోసం నా జీవితంలోకి మగాణ్ణి తెచ్చుకోను. ప్రేమించి, మోసం చేసే అబ్బాయిని తేలికగా వదిలిపెట్టను. వారికి బుద్ది చెప్పి మరీ అతణ్ణి వదిలించుకుంటాను అని చెప్పుకొచ్చింది.

ఇంకా ప్రియాంక మాట్లాడుతూ... ప్రేమలో నిజాయతీ ఉండాలి. ఒకవేళ ఎవరితో అయినా ప్రేమలో పడితే, ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే సెలబ్రిటీ అయినంత మాత్రాన నా వ్యక్తిగత జీవితం గురించి నలుగురికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా జీవితానికి మగాడు కావాలనిపిస్తే.. అది కేవలం పిల్లల కోసమే తప్ప.. నేను అతడి నుంచి వేరే ఏమి కోరుకోను అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Bold Comments  Marriage  stills  

Other Articles