Chiranjeevi | Kaththi Remake | story Trouble | new look stills | movie news

Chiranjeevi kaththi remake story in trouble

Chiranjeevi Kaththi Remake in Trouble, Megastar Chiranjeevi new look for 150th film, Chiranjeevi latest stills, Chiranjeevi hot stills, Chiranjeevi stills, Chiranjeevi gallery, Chiranjeevi 150th film news, Chiranjeevi 150th film updates, Chiranjeevi 150th film details, Chiranjeevi 150th film latest news, Chiranjeevi 150th movie details, Chiranjeevi latest stills

Chiranjeevi Kaththi Remake Story in Trouble: Megastar Chiranjeevi 150th film confirmed. chiranjeevi 150th film is tamil star hero Vijay`s block buster film Kaththi. This film will be remake director VV Vinayak.

‘కత్తి’ని అడ్డుకున్న దాసరి.. సహాయనిరాకరణ!

Posted: 01/27/2016 05:29 PM IST
Chiranjeevi kaththi remake story in trouble

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా తమిళ రీమేక్ ‘కత్తి’ చిత్రంతో తెరకెక్కనుందని, ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని ఇప్పటికే రాంచరణ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కథ, దర్శకుడు దొరికాడు.. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావిస్తుంటే... తాజాగా ఈ ప్రాజెక్టుకు ఓ కొత్త సమస్య వచ్చి చేరింది.

‘కత్తి’ సినిమా నిర్మాణంపై కథా హక్కుల వేదిక చైర్మన్ దాసరి నారాయణరావు ఆక్షంలు విధించారు. ‘కత్తి’ సినిమా హక్కులు తనవేనంటూ పోరాడుతున్న రచయిత ఎన్.నరసింహారావుకు న్యాయం జరిగిన తర్వాతనే ఈ సినిమా నిర్మాణం చేపట్టాలని దాసరి నారాయణ రావు తీర్మానించారు. అప్పటివరకు ఈ ప్రాజెక్టుకు దర్శకులు సంఘం, సినీ కార్మికుల ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారు.

కానీ ‘కత్తి’ కథ స్వయంగా తమిళ దర్శకుడు మురుగదాస్ రాసుకొని, తెరకెక్కించినదని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అవకముందే ఇలా అడ్డంకులు రావడంతో మెగా అభిమానులు కాస్త కంగారుపడుతున్నారు. త్వరలోనే ఈ అడ్డంకులు తొలగిపోయి, ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని ఆశిద్దాం.

ఈ సినిమా కోసం ఇప్పటికే చిరంజీవి కోర మీసాలు పెంచారు. ఇందులోని పల్లెటూరి వ్యక్తి పాత్ర కోసం ఇలా కోరమీసాలు పెంచుతున్నాడని అర్థమవుతోంది. మొదటగా ఈ పల్లెటూరి వ్యక్తి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసి, ఆ తర్వాత మిగతా పాత్రను షూటింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టును రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్తో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రీమేక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Kaththi Remake  story Trouble  new look stills  movie news  

Other Articles