తమిళ స్టారే అయినా కూడా తెలుగు నాట ఆ హీరోకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఆయన సినిమాలు తెలుగులో భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకోవడంలో సూర్య తర్వాతే ఎవరైనా. గజిని, సెవెన్త్ సెన్స్ లాంటి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే తాజాగా తాజాగా 'మనం' ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 24 సినిమాలో నటిస్తున్నాడు సూర్య. ఫస్ట్ లుక్తో ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచిన ఈ సినిమా తాజాగా మరోసారి ఆసక్తి రేకెత్తిస్తోంది. సూర్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మరో పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఇప్పటివరకు కనిపించని ఓ స్టన్నింగ్ లుక్లో ఉన్నారు సూర్య.
గతంలో గజిని సినిమాలో బోడిగుండుతో అదరగొట్టిన ఈ హీరో మరోసారి తన విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా ప్రదర్శించబోతున్నారని సమాచారం. ఈ సినిమా మీదద ఇప్పటికే హైప్ క్రియేటైంది. సూర్య తాజా చిత్రం 24 టైం ట్రావెల్కు సంబంధించిన ఓ థ్రిల్లర్ స్టోరీ అనే ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమాలో సూర్య డబుల్ యాక్షన్ చేస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. సూర్య సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more