ఇటీవల సంక్రాంతి బరిలో విడుదలయ్యిన నాన్నకు ప్రేమతో చిత్ర రచయిత హుస్సైన్ షా కిరణ్ దర్శకుడిగా మారి మీకు మీరే మాకు మేమే అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తో తరుణ్ షెట్టి, అవంతిక మిష్రా లు హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. కిరిటి దామరాజు, జెన్ని, భరణ్ లు ముఖ్యపాత్రల ద్వారా కనిపించనున్నారు. ఆన్‌లైన్ లో షాడో, ఒంటి గంట అనే చిత్రాలు తీసి ఫ్యామస్ అయిన నకామా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ ఫుల్‌ప్లెడ్జ్ నిర్మాణం చెపట్టారు. శ్రవన్ అందించిన ఆడియోని అతి త్వరలో విడుదల చేసి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు హుస్సైన్ షా కిరణ్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఆల్‌టైం క్లాసిక్ మిస్సమ్మ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం ఆ చిత్రం లోని ఓ సీన్ ని ఇన్స్పైర్ అయ్యి ఈచిత్రాన్ని చేశాను. అందుకే మిస్సమ్మ చిత్రానికి గౌరవం ఇస్తూ ఆ చిత్రంలోని బిట్ సాంగ్ లిరిక్ ని మీకు మీరే మాకు మేమే అనే టైలిల్ ని పెట్టాము. మా చిత్రం అందరికి నచ్చుతుంది. చక్కటి ప్రేమ కథ అందులో చిన్న ఫీల్ తో కథనం వుంటుంది. అంతేకాదు ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ గా వుంటుంది. ప్రతి సీన్ మన పక్కనే జరుగుతున్నట్టుంటుంది. ఈచిత్రం ఆడియో ని అతి త్వరలో విడుదల చేసి ఫిబ్రవరి లో చిత్రాన్ని విడుదల చేస్తున్నాము.. అని అన్నారు
నటీనటులు.. తరుణ్ షెట్టి(నూతన పరిచయం), అవంతిక మిష్రా, కిరిటి దామరాజు, జెన్ని(నూతన పరిచయం), భరణ్ తదితరులు.; సంగీతం.. శ్రవణ్; సినిమాటోగ్రఫి..సూర్య వినయ్; ఎడిటర్.. మార్తాండ్.కె.వెంకటేష్; పి.ఆర్.వో.. తేజస్వి సజ్జా; ఆర్ట్.. అభిషెక్, మనీషా సత్యవోలు, రాం.; ఎగ్సిక్యూటివ్ ప్రోడ్యూసర్.. కార్తిక్ వంశీ తాడేపల్లి; ప్రోడ్యూసర్.. నకామా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్; డైరక్టర్.. హుస్సైన్ షా కిరణ్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more