బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్పీడున్నోడు’. ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాస్ రావ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భీమనేని రోషితా సాయి సమర్పణలో గుడ్ విల్ ఫిలిమ్స్ బ్యానర్ పై భీమినేని సునీత నిర్మిస్తున్నారు.
డి.జె.వసంత్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్, రకూల్ ప్రీత్ సింగ్, తమన్నా, హేభ పటేల్, అనిల్ రావిపూడి, రెజీనా తదితరులు పాల్గొన్నారు. బిగ్ సీడీని వి.వి.వినాయక్ విడుదల చేసారు. ఆడియో సీడీలను వి.వి.వినాయక్ విడుదల చేసి, తొలిసీడీని తమన్నాకు అందజేసారు.
ఈ పాటలకు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో తమన్నా ‘బ్యాచిలర్ బాబు...’ అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more